మందుబాబులకు షాకింగ్ న్యూస్.. అక్కడ లిక్కర్ కొన్నారంటే ఇక అంతే..

by Shyam |   ( Updated:2021-11-23 03:15:06.0  )
మందుబాబులకు షాకింగ్ న్యూస్.. అక్కడ లిక్కర్ కొన్నారంటే ఇక అంతే..
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : చిల్డ్ బీరు కోసం వెళ్లిన మందుబాబుల జేబులకు చిల్లులు ప‌డుతున్నాయి. అదును చూసి వైన్‌షాపుల నిర్వాహాకులు అద‌న‌పు దోపిడీకి తెర‌లేపారు. నూత‌న మ‌ద్యం షాపుల టెండ‌ర్ల ప్రక్రియ ముగిసింది. పాత వైన్‌షాపుల నిర్వాహాకుల గ‌డువు ఈనెల 30తో ముగిసిపోతుంది. ఇక కొత్తగా ఆ ఏరియాలో వైన్‌షాపులు ద‌క్కని వ్యాపారులు అడ్డదిడ్డంగా దండుకోవ‌డం మొద‌లుపెట్టారు. ఎమ్మార్పీని ప‌క్కన పెట్టి సొంత రేట్లను ఫిక్స్ చేసుకుని లిక్కర్ అమ్మకాలు సాగిస్తున్నారు. య‌థేచ్ఛగా సాగుతున్న అద‌న‌పు దోపిడీని అడ్డుకోవ‌డానికి ఎక్సైజ్ అధికారులు క‌నీస ప్రయ‌త్నం చేయ‌క‌పోవ‌డం విశేషం. ఏం చేసినా, ఈ నాలుగు రోజులే క‌దా అన్న అభిప్రాయంతో వ్యాపారుల ఇష్టారాజ్యానికి వ‌దిలేసిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇక్కడ లేదు.. అక్కడ కొనండి..

వైన్‌షాపుల్లోని స‌రుకునంతా బెల్ట్‌షాపుల‌కు త‌ర‌లించి కృత్రిమ కొర‌త సృష్టిస్తున్నారు. వైన్‌షాపులో దొర‌క‌ని మిడిల్‌క్లాస్ మందుబాబుల బ్రాండ్లు అన్నీ బెల్ట్‌షాపులో మాత్రమే దొరుకుతున్నాయి. బీరు బాటిళ్ల పైనా ఇదే తంతు. మందుబాబుల‌కో రేటు.. బెల్ట్‌షాపుల నిర్వహాకుల‌కో రేటు చొప్పున మ‌ద్యం వ్యాపారులు అమ్మకాలు జ‌రుపుతుండ‌టం గ‌మ‌నార్హం. త‌మ‌తో ఎలాంటి లింకులేకుండా కేవ‌లం ఎక్సైజ్ అధికారుల‌ను మ‌చ్చిక చేసుకుని బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న వారికి క్వార్టర్ లిక్కర్‌, బీరు బాటిల్‌పై రూ.20 అద‌నంగా పుచ్చుకుంటూ వ్యాపారులు స‌రుకును విక్రయిస్తున్నారు.

Advertisement

Next Story