TG Police: తెలంగాణ పోలీస్ కొత్త లోగో విడుదల.. పాత దానికి, కొత్త దానికి తేడా ఇదే!

by Ramesh Goud |   ( Updated:2024-12-29 15:40:37.0  )
TG Police: తెలంగాణ పోలీస్ కొత్త లోగో విడుదల.. పాత దానికి, కొత్త దానికి తేడా ఇదే!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ పోలీస్(Telangana Police) కొత్త లోగోను(New Logo) పోలీస్ శాఖ(Police Department) విడుదల(Reliesed) చేసింది. ఈ మేరకు తెలంగాణ పోలీస్ ట్విట్టర్ ఖాతాలో న్యూ లోగోను పోస్ట్ చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఏర్పడ్డాక పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. తెలంగాణలో గతంలో ఉన్న అధికారిక పేర్లలో మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర అధికారిక పేరుగా ఉన్న తెలంగాణ స్టేట్‌ను కేవలం తెలంగాణాగా మార్చింది. ఈ నేపథ్యంలోనే పలు ప్రభుత్వ కార్యాలయాలు తమ శాఖలకు ముందు ఉన్న టీఎస్(TS) పేరును తొలగించి, టీజీ(TG)గా మార్పులు చేశారు. దీంతో తెలంగాణ పోలీస్ కూడా తమ శాఖకు సంబంధించిన అధికారిక చిహ్నంలో మార్పులు చేసింది. గత లోగోలో ఉన్న తెలంగాణ స్టేట్ పోలీస్(Telangana State Police) తొలగించి.. తెలంగాణ పోలీస్ అనే పేరుతో కొత్త లోగోను విడుదల చేసింది. గత లోగోలో కేవలం స్టేట్ అనే పదాన్ని తొలగించి కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించింది. దీంతో పోలీస్ శాఖ అధికారిక చిహ్నం తెలంగాణ స్టేట్ పోలీస్ నుంచి తెలంగాణ పోలీస్ గా మారింది.

Advertisement

Next Story