- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'షూటర్ దాది' కన్నుమూత
దిశ, స్పోర్ట్స్ : ‘షూటర్ దాది’గా గుర్తింపు పొందిన చంద్రో తోమర్ (89) శుక్రవారం కోవిడ్-19 బారిన పడి మృతి చెందారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కావడంతో ఏప్రిల్ 26న ఆమెను మీరట్‌లోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. శుక్రవారం పరిస్థితి విషమించి ఆమె మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. తన 60వ ఏట పిస్టల్ పట్టిన చంద్రో తోమర్ ప్రపంచంలోనే పెద్ద వయస్కురాలైన షార్ప్ షూటర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాఘ్‌పట్ గ్రామానికి చెందిన తొమర్.. తమ గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన షూటింగ్ రేంజ్‌లో అనుకోకుండా పేరు నమోదు చేసుకున్నారు. తమ కుటుంబంలోని ఒక యువకుడు షూటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవడాని వెళ్లగా.. చంద్రో అతని వెంట వెళ్లి తాను కూడా కోచింగ్‌లో చేరింది. అతి త్వరగా షార్ప్ షూటర్‌గా గుర్తింపు తెచ్చుకొని ఎన్నో జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. చంద్రో జీవితంతో స్పూర్తి పొందిన దర్శకుడు ఒకరు ‘సాండ్ కి ఆంఖ్’ అనే చిత్రాన్ని నిర్మించారు. చంద్రో మరదలు ప్రకాక్షి తోమర్ కూడా షార్ప్ షూటర్. ‘నన్ను వదిలేసింది. ఎక్కడికి వెళ్లావు చంద్రో’ అని ప్రకాక్షి తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేసింది. చంద్రో ప్రతిష్టాత్మక స్త్రీ శక్తి అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.