- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'షూట్-అవుట్ ఎట్ ఆలేరు' ట్రైలర్ విడుదల
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు వీక్షకులకు అత్యుత్తమ కంటెంట్ అందిస్తున్న ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ 5’. తాజాగా మరో ఇంటెన్స్ అండ్ యాక్షన్ డ్రామాను ప్రజల ముందుకు తీసుకొస్తోంది. ‘జీ 5’ కోసం ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ నిర్మించిన వెబ్ సిరీస్ ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’. మంగళవారం సాయంత్రం వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు.
పోలీసులను నడిరోడ్డు మీద తుపాకీతో కాల్చి చంపుతున్న ఘటనలు వార్తల్లో ముఖ్యాంశం అవుతుంది. 2007 నుండి 2010 వరకు ప్రతి ఏడాది మక్కా మసీదు బాంబు బ్లాస్ట్ యానివర్సరీ రోజున హిందూ పోలీసులను చంపిన అక్తరే, ప్రస్తుత మరణాలకు కారణమా? అని మీడియా సందేహం వ్యక్తం చేస్తుంది. ఐదేళ్ల క్రితం ఎన్కౌంటర్ లో మరణించిన అక్తర్ మరణాలకు కారణం అంటే పోలీసులు నమ్ముతున్నారా? మరణించిన అక్తర్ మళ్లీ ఎలా బతికొచ్చాడు? తమపై సాగిస్తున్న హత్యాకాండకు పోలీసులు ఎలా ముగింపు పలికారు? వంటి విషయాలు వెబ్ సిరీస్ చూస్తే తెలుస్తాయని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.
What Led To The #ShootOutAtAlair?
An Outlaw Who Is Responsible To All The Chaos In The Department?
Watch #ShootOutAtAlair Premieres 25th December Only On #ZEE5.#ShootOutAtAlairOnZEE5 #ZEE5Original #OfficialTrailer#Premieres25ThDecember pic.twitter.com/ftUuamwZWl— ZEE5 Telugu (@ZEE5Telugu) December 8, 2020
‘సైరా నరసింహారెడ్డి’ సహా పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ నిర్మాణ సంస్థను నెలకొల్పి… తొలి ప్రయత్నంగా నిర్మించిన వెబ్ సిరీస్ ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’. ‘జీ 5’ అసోసియేషన్‌తో ఈ వెబ్ సిరీస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ వెబ్ సిరీస్ ‘జీ 5’లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నందిని రాయ్ తదితరులు ప్రధాన పాత్రధారులు. దీనికి ఆనంద్ రంగా దర్శకత్వం వహించారు. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయని ‘జీ 5’ వర్గాలు వెల్లడించాయి.