- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని సిర్గాపూర్ మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులు, హరితహారం అమలు తీరుపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్ హన్మంతరావు పంచాయతీ సెక్రెటరీకి షోకాజ్ నోటీసు జారీచేశారు. శనివారం జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించిన కలెక్టర్ ప్రభుత్వ అభివృద్ధి పనులపై సమీక్షించారు.విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యం చేస్తే సహించబోమని హెచ్చరించారు. డంపు యార్డు, వైకుంఠ ధామాల నిర్మాణాలు నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులు, సర్పంచ్‌లపై చర్యలు తప్పవని కలెక్టర్ ఫైర్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా కంగి మండలంలోని రామతీర్థం గ్రామ పంచాయతీని స్థానిక అధికారులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం అక్కడ చేపడుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. ఆయా మండలాల్లో ఎంపీడీఓలు, ఎంపీఓలు, ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతిరోజూ పనుల పురోగతి మెరుగుపడేలా చూడాలన్నారు. సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామంలో పారిశుధ్య, హరితహారం పనులపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ పంచాయతీ కార్యదర్శి రమేశ్‌కు షోకోజ్ నోటీసు జారీ చేశారు.