హుజురాబాద్‌లో నిఘా వర్గాలకు భారీ షాక్.. కారణం అదేనా.?

by Sridhar Babu |   ( Updated:2021-07-07 07:52:47.0  )
హుజురాబాద్‌లో నిఘా వర్గాలకు భారీ షాక్.. కారణం అదేనా.?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ ఎన్నికలేమో కానీ.. నిఘా వర్గాలకు సరికొత్త కష్టమొచ్చింది. క్షణ క్షణం అప్ డేట్స్ చేస్తూ డ్యూటీ చేస్తున్న ఇంటలిజెన్స్ వర్గాల కదలికలు తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు కొత్త మెలిక పెట్టినట్టు సమాచారం. ఈటల ఎపిసోడ్ నుంచి నిత్యం సీక్రెట్ సర్వేలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్న ఇంటలిజెన్స్ వర్గాలు ఇప్పుడు తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకోసం హైలెవల్ ఆఫీసర్లు అగ్ని ప్రవేశం చేయాలనో, లేక తమ నిజాయితీని నిరూపించుకునేందుకు ఎలాంటి ఆధారాలు చూపించాలనో అడగడం లేదు.

హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ తిరుగుతున్నారోనన్న ఆధారాలు తమకు అందించేందుకు తాము కేవలం ఆర్టీసీ టికెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారట. దీంతో, ఇప్పటి వరకు వాహనాలపై తిరిగిన ఇంటలిజెన్స్ పోలీసులు ఆర్టీసీ బస్సుల్లో తిరుగుతూ జనం నాడి పట్టుకునే పనిలో పడ్డారు. అయితే, బస్సుల్లో ప్రయాణించేప్పుడు ప్రయాణీలు ఏం మాట్లాడుకుంటున్నారో అన్న విషయం పక్కనపెట్టి.. తాము తీసుకున్న బస్సు టికెట్లు తమ వద్ద భద్రంగా ఉన్నాయా లేదా అని క్రాస్ చెక్ చేసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది.

ఇదే కారణమా..?

హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌కు అనుకూలమైన పరిస్థితులు లేవన్న నివేదికలు ఇంటలిజెన్స్ వర్గాలు ఇచ్చాయి. అయితే, పార్టీ పరంగా మాత్రం అక్కడి ప్రజలు అనుకూలంగా మారారని.. ఈటల ఓటమి ఖాయమని అధిష్టానానికి నివేదికలు వెళ్తున్నాయట. దీంతో, ఈ నివేదికలకు పోలిక లేకపోవడంతో అసలేం జరుగుతోంది.. గ్రౌండ్ రియాల్టిపై క్లారిటీ కావాలి అన్న కారణంతోనే ఇంటలిజెన్స్ యంత్రాంగం అంతా కూడా ఆర్టీసీ బస్సుల్లోనే తిరగాలని, ఇందుకు సంబంధించిన టికెట్లను కూడా ప్రొడ్యూస్ చేయాలని అధికారులు ఆదేశిలిచ్చారట. దీంతో, హుజురాబాద్ ఎన్నికల్లో ప్రజా నాడి తెలుసుకునేందుకు నిఘా వర్గాలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం ఆరంభించాయి. ఒక వేళ నిఘా బృందాలు నిజంగానే ఉన్నతాధికారులను మిస్ గైడ్ చేయాలనుకుంటే ప్రైవేటు వాహనాల్లో తిరిగి, బస్టాండ్ల వద్ద కొద్ది సేపు నిలబడి ప్రయాణీకుల టికెట్లు అడిగి.. అధికారులకు అప్పగిస్తే ఎలా పసిగడతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. తానోటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్న విధంగా నిఘా టీమ్స్ వ్యవహరించాయని కూడా భావించాల్సి వస్తుందేమో.

Read More: సీతక్క తనకు కంకణం ఎందుకు కట్టిందో చెప్పిన రేవంత్..

Advertisement

Next Story