వాహనదారులకు షాక్… ఇకపై హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి

by srinivas |
High security number plate
X

దిశ, డైనమిక్ బ్యూరో : వాహనదారులు తమ వాహనాలకు రేడియంతో నంబర్ ప్లేట్ వేసుకొని రోడ్డెక్కేస్తుంటారు. కానీ 2014లో కేంద్ర ప్రభుత్వం హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ తీసుకొచ్చి కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు అమర్చేలా చర్యలు తీసుకుంటోంది. అయితే కొందరూ ఈ నిబంధనను బేఖాతరు చేస్తున్నారు. దీనిపై సీరియస్‌గా వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

2014 తర్వాత తీసుకున్న కొత్త వాహనాలపై హై సెక్కూరిటీ నంబర్‌ ప్లేట్‌ తప్పనిసరిగా అమర్చాలని ఏపీ రవాణా శాఖ తెలిపింది. డీలర్ల నిర్లక్ష్యంతో నంబర్‌ ప్లేటు ఏర్పాటులో జాప్యంతో వాహనదారులు ఫ్యాన్సీ నంబర్‌ ప్లేట్ల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారన్నారని రవాణా శాఖ అభిప్రాయపడింది. నంబర్‌ ప్లేట్లపై అవగాహన కల్పించి, డీలర్ల వద్ద జాప్యం లేకుండా తనిఖీలు చేయాలని డీటీసీలను ఆదేశించింది. హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేటుపై తొలుత అవగాహన కల్పించి, ఆ తర్వాత కేసులు, జరిమానా విధిస్తామని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed