వాహనదారులకు షాక్.. ఇక అలా చేసినా భారీ ఫైన్లే!

by Anukaran |   ( Updated:2021-09-06 07:03:46.0  )
U turn
X

దిశ, డైనమిక్ బ్యూరో: వాహనదారులకు సైబరాబాద్ పోలీసులు మరో షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, విత్ అవుట్ హెల్మెట్, విత్ అవుట్ సీట్ బెల్టు తదితర అంశాల మాత్రమే ట్రాఫిక్ ఉల్లంఘన కిందకి వస్తుందని వాహనదారులు అనుకుంటున్నారు. అయితే సిగ్నల్ పడినప్పుడు యూ టర్న్ తీసుకున్నా నేరమేనని, ఈ విషయం ఎంవీ యాక్ట్‌లో స్పష్టంగా ఉందని సైబరాబాద్ పోలీసులు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సిగ్నల్ పడినప్పుడు యూ టర్న్ చేయడం ద్వారా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని.. అంతే కాకుండా కార్లు, పెద్ద వాహనాలు యూ టర్న్ తీసుకునే సమయంలో ట్రాఫిక్‌ జాం అవుతుందని పోలీసులు చెబుతున్నారు. అయితే సైబరాబాద్ పరిధిలో ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతుండడంతో పోలీసులు ఈ నిబంధనను పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. కేవలం సిగ్నల్ పడినప్పుడు మాత్రమే యూటర్న్ తీసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed