జగన్ సర్కార్‌కి షాక్.. ఆ నియామకం కొట్టేసిన హైకోర్టు

by srinivas |
జగన్ సర్కార్‌కి షాక్.. ఆ నియామకం కొట్టేసిన హైకోర్టు
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ హైకోర్టులో ప్రభుత్వానికి షాక్ తగిలింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, సింహాచలం దేవస్థానం ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన సంచైతా గజపతి రాజు నియామకం చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఏపీ హైకోర్టు కొట్టేసింది. సంచైతా గజపతిరాజును రెండు పదవుల నుంచి తొలగిస్తూ తీర్పు వెల్లడించింది. అలాగే మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్మన్‌గా తిరిగి కేంద్ర మాజీమంత్రి అశోక్‌గజపతిరాజునే నియమించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇకపోతే మాన్సాస్, సింహాచలం దేవస్థానం చైర్మన్‌గా సంచైతాగజపతిరాజు నియామకం చెల్లదని మాజీ చైర్మన్, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డుగోలుగా రాత్రికి రాత్రి రహస్య జీవోలు తీసుకువచ్చి సంచైతా గజపతి రాజుని నియమించారని ఆరోపించారు. ఈ నియామకం చెల్లదు అని ఆమెని తొలగించాలి అని ఆధారాలు సమర్పించారు. ఆధారాలను పరిశీలించిన ఏపీ హైకోర్టు అశోక్‌గజపతిరాజు తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించింది. సంచైతా గజపతి రాజుని రెండు పదవుల నుంచి తొలగిస్తూ తీర్పువెల్లడించింది. కోర్టు ఆదేశం పట్ల మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు హర్షం వ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌, సింహాచలం దేవస్థానం చైర్మన్‌గా పునర్నియామకంపై సాయంత్రం 5 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.

Advertisement

Next Story