Devara : జ‌క్క‌న్న‌ ఫ్లాప్ సెంటిమెంట్‌కు ఎన్టీఆర్ దేవరతో బ్రేక్‌.. రాజమౌళి కొడుకు కామెంట్స్..

by Prasanna |
Devara :  జ‌క్క‌న్న‌ ఫ్లాప్ సెంటిమెంట్‌కు ఎన్టీఆర్ దేవరతో  బ్రేక్‌.. రాజమౌళి కొడుకు కామెంట్స్..
X

దిశ , వెబ్ డెస్క్ : ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళితో సినిమా చేయాలంటే అదృష్టం ఉండాలని చాలా మంది అంటుంటారు. దాదాపు ప్ర‌తి హీరో కల కూడా అదే ఉంటుంది. ఆయనతో సినిమా చేస్తే అది పక్కా హిట్ కానీ బ్లాక్ బాస్ట‌ర్‌గాని అవుతుంది. అయితే.. రాజ‌మౌళితో మూవీ చేసిన తర్వాత ఏ హీరో కూడా వెంట‌నే హిట్ కొట్టింది లేదు. ఇది ఓ మిస్ట‌రీ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు దీన్ని ఎన్టీఆర్ దేవ‌ర‌తో బ్రేక్ చేశాడ‌నే కామెంట్స్ చేస్తున్నారు.

ఎన్టీఆర్‌, రాజ‌మౌళి కాంబోలో వ‌చ్చిన స్టూడెంట్ నెంబ‌ర్ 1 సెప్టెంబ‌ర్ 27, 2001 లో రిలీజ్ అయింది. ఇక దేవ‌ర సరిగ్గా సెప్టెంబ‌ర్ 27 విడుద‌లైంది. అంటే.. 23 ఏళ్ల కింద‌ట ఏ హీరోతో మొద‌లైందో, మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ఆ సెంటిమెంటుకి బ్రేక్ పడిందని సోష‌ల్ మీడియాలో టాక్ నడుస్తుంది.

ఇక, దీనిపై రియాక్ట్ అయినా రాజ‌మౌళి కొడుకు ఇలా రాసుకొచ్చాడు. " ఫైన‌ల్‌గా 23 ఏళ్ల ఈ మిత్ బ్రేక్ అయింది. ఏ మనిషితో ఏ రోజు అయితే జర్నీ స్టార్ట్ అయిందో .. మ‌ళ్లీ అదే రోజు అదే వ్య‌క్తితో బ‌ద్ద‌లైందని అన్నారు. చిన్న‌ప్ప‌టి నుంచి ఎన్టీఆర్‌ను చూస్తున్నాన‌ని, ఆయ‌నను చూస్తూ పెరిగాను, సినిమాకు కోసం చాలా కష్ట పడతాడు .. నాకు మాట‌లు రావ‌డం లేదు. ఫ్యాన్స్ సెలెబ్రేష‌న్స్ మొదలు పెట్టండి. మ్యాడ్‌నెస్ కూడా ఇప్పుడు మాట్లాడుతుంది " అని కార్తికేయ ట్విట్ చేశాడు.

Advertisement

Next Story