- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సాగర్ బై పోల్.. కాంగ్రెస్, బీజేపీ నేతలకు షాక్
దిశ, తెలంగాణ బ్యూరో : నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి తొలి ప్రక్రియ పూర్తి అయింది. నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణలు పూర్తి కావడంతో బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కాగా వివిధ కారణాలతో 17 మంది నామినేషన్లను తిరస్కరించినట్లు వెల్లడించారు. దీనిలో పదిమంది అభ్యర్థులు స్వతంత్రులు కాగా.. ఏడుగురు వివిధ పార్టీలకు చెందినవారు. నామినేషన్లను తిరస్కరించిన జాబితాలో బీజేపీ నేత నివేదితారెడ్డి, కాంగ్రెస్ నుంచి కాటావత్ శంకర్ నాయక్, అమ్ ఆద్మీ పార్టీ నుంచి మహ్మద్ కుత్భుద్దీన్తో పాటు పలువురు ఉన్నారు.
ఇక 60 నామినేషన్ల ఆక్సెప్ట్ చేసినట్లు ఈసీ ప్రకటించింది. దీంతో సాగర్ బరిలో మొత్తం 60 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, బీజేపీ నుంచి రవి నాయక్, టీఆర్ఎస్ నుంచి భగత్ కుమార్, టీడీపీ నుంచి మువ్వా అరుణ్ కుమార్, ఎంఐఎం నుంచి నూరజ్ బేగం, ఎంసీపీఐ నుంచి కాశయ్య, అన్నా వైఎస్ఆర్ నుంచి వడ్ల శ్యాంతో పాటుగా 46 మంది స్వతంత్రులు బరిలో నిలిచినట్లు సీఈఓ శశాంక్ గోయల్ వెల్లడించారు.