సీఎం కేసీఆర్‌కు షాక్.. మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్

by Anukaran |
సీఎం కేసీఆర్‌కు షాక్.. మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో త్వరలో ఏర్పాటుచేసే మద్యం దుకాణాల టెండర్లలో రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని హైకోర్టు బుధవారం అత్యవసరంగా విచారణ చేపట్టింది. కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉందని పిటిషనర్ తరఫు న్యాయవ్యాది వాదించగా.. ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు నిర్ణయించారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వాన్ని సంప్రదించి వివరాలు సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed