హాలీవుడ్ చాన్స్ కొట్టేసిన శోభిత ధూళిపాళ

by Shyam |   ( Updated:2021-03-17 03:19:15.0  )
Sobhita Dhulipala
X

దిశ, సినిమా: టాలెంటెడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ హాలీవుడ్ చాన్స్ కొట్టేసింది. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ యాక్టర్ దేవ్ పటేల్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. ‘మంకీ మ్యాన్’ టైటిల్‌తో వస్తున్న సినిమా ద్వారా దేవ్ పటేల్ డైరెక్టర్‌గా మారనుండగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా వరల్డ్ వైడ్ రైట్స్ 30 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది. 2022లో రిలీజ్ కానున్న సినిమా గురించి మాట్లాడిన శోభిత ఐదేళ్ల క్రితం ఈ మూవీ ఆడిషన్ ఇచ్చానని తెలిపింది.

ఆల్మోస్ట్ ఈ సినిమా గురించి మరిచిపోయానని, సినీ ప్రయాణంలో ఎన్నో మలుపుల తర్వాత మళ్లీ ఈ ఆఫర్ రావడంతో కెరీర్ ఫస్ట్ డేస్ గుర్తొచ్చాయని చెప్పింది. 2016లో తన ఫస్ట్ ఫిల్మ్ ‘రామన్ రాఘవ్ 2.0’ గురించి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరై వచ్చే క్రమంలో తనను ఆడిషన్ చేశారని, ఆ రోజు ఇంకా గుర్తుందని తెలిపింది. చిత్రంలో తన పాత్ర సున్నితంగా, ఆకర్షణీయంగా ఉంటుందన్న శోభిత దేవ్ పటేల్ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని వివరించింది. జైలు నుంచి విడుదలైన వ్యక్తి కార్పొరేట్ దురాశ, ఆధ్యాత్మిక విలువలతో నిండిన ప్రపంచాన్ని ఎలా పోల్చాడు? ఏ విధంగా రివేంజ్ తీసుకున్నాడు అనేది ‘మంకీ మ్యాన్’ కథగా ఉంటుందట.

https://twitter.com/sobhitaD/status/1372057018119254018?s=20

Advertisement

Next Story

Most Viewed