- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరోయిన్ శోభిత కన్నీటి గాథ..
దిశ, సినిమా : కరోనా కన్నీటి గాథలకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోతున్న సమయంలో.. ఇక్కడే మిగిలిపోయిన ప్రియమైన వారు ఎలాంటి నరకయాతన అనుభవిస్తున్నారు? ఈ కఠిన పరిస్థితుల్లో తోడున్న వారికి ధైర్యం చెప్పలేక ఎలా దు:ఖిస్తున్నారు? ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న హీరోయిన్ శోభిత ధూళిపాళ తన బాధను కవిత రూపంలో ట్వీట్ చేసింది. ఈ భయంకరమైన సిచ్యుయేషన్‌ను వివరిస్తూ గుండెలో దాగిన బాధను వివరించింది. ‘నేను భయపడుతున్నాను.. నొప్పిలేకుండా చేసే వాగ్ధానంలో భాగంగా నా ప్రియమైనవారు నా గుండె నొప్పిని నైవేద్యంగా తీసుకుని వెళ్లిపోయారు. దేవుడు గుల్మోహర్ చెట్టు కింద కూర్చుని, ముసిముసిగా నవ్వుతూ బంగారు పూత పూసిన బైనాక్యులర్స్ గుండా పెద్ద మనుషులను చిన్నగా చూడటం మొదలెట్టాడు. నా పెరట్లో మంటలు మండుతున్నాయి. బ్రదర్.. నేను ప్రతీ రాత్రి నా భయాలను పువ్వులుగా మలుస్తున్నాను.. నా బలహీనమైన తల్లిని నవ్వించేందుకు కొత్త జోకులు కనుగొంటున్నాను.. కానీ నా నాలుక కింద మాత్రం స్తోత్రం పలుకుతూనే ఉంది’ అంటూ తన అనుభవాన్ని పంచుకుంది.
— Sobhita Dhulipala (@sobhitaD) May 2, 2021