- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పోలీస్ జులుం.. కూరగాయల బుట్టను కాలితో తన్ని..
దిశ, వెబ్‌డెస్క్ : పేరుకు పోలీసు అధికారి.. సామాన్య ప్రజల పట్ల ఆయన ప్రవర్తన తీరు వివాదాస్పదంగా మారింది. కూరగాయలు అమ్ముకునే వ్యక్తి దగ్గరకు వెళ్లిన పంజాబ్ పోలీస్.. ఆ బుట్టలను కాలితో తన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంజాబ్‌లోని ఫగ్వారా ఎస్హెచ్వో నవదీప్ సింగ్ అతని టీం టౌన్‌లో పెట్రోలింగ్‌కు వెళ్లింది.
రాష్ట్రంలో జరుగుతున్న పాక్షిక లాక్‌డౌన్‌పై తనిఖీలు చేయడానికి వచ్చారు. సారాయ్ రోడ్‌కు రాగానే చాలా మంది చిరువ్యాపారులు రోడ్ పక్కనే దుకాణాలు పెట్టుకుని కూర్చున్నారు. అది చూసిన నవదీప్ సింగ్.. కార్ దిగిన వెంటనే ఆగ్రహంలో కూరగాయల దుకాణం దగ్గర ఉన్న బుట్టను బూటు కాలితో తన్నాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. దీనిపై కపూర్తలా ఎస్ఎస్పీ కన్వర్దీప్ కౌర్ యాక్షన్ తీసుకుంటూ అతణ్ని సస్పెండ్ చేశారు. అటువంటి చర్యలు కరెక్ట్ కాదని రూల్స్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే్ శిక్ష తప్పదని హెచ్చరించారు.