శివరాత్రికి నోచుకోని శివాలయం.. ఎక్కడో తెలుసా..?

by Anukaran |
శివరాత్రికి నోచుకోని శివాలయం.. ఎక్కడో తెలుసా..?
X

దిశ, వాజేడు: వైభవంగా జరగాల్సిన శివయ్య కల్యాణ మహోత్సవానికి వాజేడు శివాలయం నోచుకోవడంలేదు. రెండు దశాబ్దాలుగా వాజేడు శివాలయం మూతపడడంతో ఆలయం కళతప్పి శిథిలావస్థకు చేరుకుంది. శివాలయం మూతబడిన కాలం నుండి వాజేడు మండలం కళ తప్పి అభివృద్ధికి నోచుకోవడం లేదని పలువురు భక్తులు అభిప్రాయపడుతున్నారు. దేవాదాయ శాఖ వారు స్పందించి శివాలయం పున ప్రారంభించాలని వేడుకుంటున్నారు.

ఒకప్పుడు వైభవంగా..

ములుగు జిల్లా వాజేడు మండలంలోని శివాలయం ఒకప్పుడు కలకలలాడుతూ శివరాత్రి రోజున వైభవంగా కల్యాణం జరిగేదని స్థానికులు చెప్తున్నారు. శివయ్య కల్యాణాన్ని తిలకించడానికి ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యేవారు.

1976లో నిర్మాణం..

ఈ ఆలయాన్ని 1976లో కాకర్లపూడి వీరభద్ర రాజు అనే భక్తుడు ఆలయాన్ని నిర్మించాడు. ఏటా అత్యంత వైభవంగా శివయ్య కల్యాణాన్ని జరిపించేవారు. అతడికి సంతానం లేకపోవడంతో ఈ ఆలయాన్ని నిర్మించి కల్యాణం జరిపించేవారని పూర్వికులు చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed