బంధువుల అమ్మాయితో శింబు వివాహం?

by Jakkula Samataha |
బంధువుల అమ్మాయితో శింబు వివాహం?
X

కోలీవుడ్ హీరో శింబు ఇప్పటివరకు చాలా మంది హీరోయిన్లతోనే రిలేషన్‌షిప్ మెయింటైన్ చేశాడు. నయనతార, త్రిష, హన్సికలతో ప్రేమాయణం నడిపినా.. అవేవి పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. ప్రస్తుతం అన్ని రిలేషన్లకు దూరంగా ఉంటూ సినిమాలపై దృష్టిపెట్టిన శింబు.. త్వరలోనే లండన్‌కు చెందిన అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నాడని వార్తలు వెలువడుతున్నాయి. లాక్‌డౌన్ ఎత్తేసిన వెంటనే విదేశాల్లో ఉంటున్న తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని తమిళ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే శింబు తల్లిదండ్రులు మాత్రం ఇదంతా ఫేక్ న్యూస్‌ అని కొట్టిపారేశారు. ‘మా కొడుక్కు కాబోయే భార్యను వెతికే పనిలోనే ఉన్నామని.. బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడనే వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. శింబుకు తగిన అమ్మాయిని చూసి త్వరలోనే పెళ్లి చేస్తామని’ ప్రకటించారు. దీంతో శింబు పెళ్లిపై స్ప్రెడ్ అవుతున్న కథనాలకు ముగింపు పలికింది మీడియా.

మరో వైపు శింబు మాజీ ప్రియురాలు నయనతార కూడా పెళ్లి పీటలు ఎక్కనుందనే వార్తలు ఊపందుకున్నాయి. డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో గుడిలో వివాహం చేసుకోనుందనే ప్రచారం జరుగుతుండగా.. దీనిపై నయన్ శివన్ ఇంకా స్పందించలేదు.

Advertisement

Next Story

Most Viewed