- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మా.. అప్పుడే బాగున్నావ్ : శిల్ప కొడుకు
బాలీవుడ్ ఫిట్ హీరోయిన్ శిల్పా శెట్టి.. ఇప్పటికీ ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. రోజూ యోగా, ఎక్సర్‌సైజులకు ఎక్కువ సమయం కేటాయించే భామ.. ఈ మధ్యే ఇమ్యూనిటీ పవర్ పెరిగేందుకు ఎలాంటి యోగాభ్యాసం చేయాలి? ఎటువంటి ఆహారం తీసుకోవాలి? అనే దానిపై పుస్తకం కూడా రాసింది. ఇద్దరు పిల్లలకు తల్లయినా సరే ఇంత యంగ్‌గా ఎలా కనిపిస్తున్నారని అందరూ తనని చూసి ఆశ్చర్యపోతుంటే.. తన కొడుకు మాత్రం ముసలిదానివి అయిపోతున్నావని గుర్తుచేస్తున్నాడని చెప్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శిల్పా శెట్టిని, మీ కొడుకు వియాన్.. మీ సినిమాలు చూసి ఎలాంటి రియాక్షన్ ఇచ్చాడన్న ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది. ‘ఈ మధ్యే వియాన్ తన ఫస్ట్ మూవీ బాజీగర్ చూసి.. అందులో చాలా క్యూట్‌గా, యంగ్‌గా కనిపిస్తున్నావ్ మమ్మీ అన్నాడు. నేను వయసు మళ్లిపోతున్నానని చెప్పేందుకు ట్రై చేస్తున్నాడు’ అని చెప్పింది. ఇంకా ఏమైనా సినిమాలు చూపిస్తారా? అని అడిగితే.. అమ్మో ఏదైనా చూపిస్తే తను అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు ఉండవని తెలిపింది శిల్ప. కానీ తన ‘రిశ్తే’ మూవీ మాత్రం చూపించానంది.
కాగా, 1993లో విడుదలైన బాజీగర్ సినిమాలో షారుఖ్ ఖాన్ హీరో కాగా.. కాజోల్, శిల్పా శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఆ ఏడాది అధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో బాజీగర్ నాలుగో స్ధానంలో నిలిచింది.