- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శిల్పా యోగా పాఠం .. వెన్ను నొప్పి మాయం
అందాల భామ శిల్పా శెట్టి ఫిట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్. రోజులో గంట నుంచి రెండు గంటల సమయం యోగాకు కేటాయించే భామ… ఆరోగ్య సూత్రాలు, చిట్కాలు చెప్తూ సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ను సంపాదించింది. రోజుకో యోగా పాఠం చెప్తూ… అభిమానులను ఫాలో కావాలని సూచిస్తుంది. పరిపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని కోరుతోంది.
ఇందులో భాగంగా తాజాగా ఒక వీడియో పోస్ట్ చేసిన శిల్పా… ఇలా చేస్తే వెన్ను నొప్పి తగ్గుతుందని చెప్తోంది. ప్రస్తుతం మనం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. అందరూ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే .. మరికొందరు ఖాళీగానే ఉండాల్సి వస్తుంది. మొత్తానికి చాలా తక్కువ శరీర కదలికలతో ఉంటున్నామని చెప్పింది. ఈ పరిస్థితి శరీరాన్ని గందరగోళానికి గురి చేస్తోందన్నారు. ఇది కాస్త తీవ్రమైన వెన్ను నొప్పి, కండరాల నొప్పులకు దారి తీస్తోందని చెప్తోంది శిల్పా. కానీ తను చెప్పే యోగా ఆసనాలు ఫాలో అయితే దీర్ఘకాలిక వెన్ను నొప్పి తగ్గి, వెన్ను భాగం బలోపేతం అవుతుందని తెలిపింది. నేను రోజూ యోగా అభ్యసిస్తున్నాను అని.. తద్వారా అద్భుతాలు చూడగలుగుతున్నాను అంటోంది. మీరు కూడా మీ శరీరానికి కాస్త కదలిక ఇచ్చి… బాడీ షాక్ లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తోంది. ఇంట్లోనే యోగా చేస్తూ.. ఇంటికే పరిమితం అవుతూ సురక్షితంగా ఉండాలని ప్రజలను కోరుతోంది.