- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శిల్పా శెట్టిపై చీటింగ్ కేసు.. కోట్లలో మోసం చేసిందని ఆరోపణలు
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి, ఆమె తల్లి సునంద శెట్టి మరోసారి చిక్కుల్లో పడ్డారు. తమ దగ్గర కోట్ల రూపాయలు తీసుకుని చీట్ చేశారంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు కేసు పెట్టారు. దీంతో లక్నోకు చెందిన పోలీసులు శిల్పా, సునందనలను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. లక్నోలో లోసిస్ వెల్‌నెస్ సెంటర్‌కు శిల్పా చైర్మన్ కాగా, తన తల్లి డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ ఫిట్‌నెస్ సెంటర్‌కు సంబంధించి మరో బ్రాంచ్ ఓపెన్ చేసేందుకు జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్‌ల దగ్గర కోట్లలో డబ్బులు తీసుకున్నా పని జరగలేదని, డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని ఆరోపిస్తూ.. విభూతి ఖండ్, హజ్రత్ రంగ్ పోలీస్ స్టేషన్‌లలో చీటింగ్ కేసు పెట్టారు. దీనిపై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించనున్నారు పోలీసులు. ఇక మరోవైపు శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయాల్లో శిల్పా, తన తల్లిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో అభిమానులు బాధపడుతున్నారు.