- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇషాన్ కిషన్ ఎంట్రీ.. డేంజర్ జోన్‌లో గబ్బర్
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియాలో స్థానం సంపాదించడం ఎంత కష్టమో.. దాన్ని నిలబెట్టుకోవడం అంత కంటే మరింత కష్టం. ఒక సారి తుది జట్టులో స్థానం దక్కిందని సంబురపడి రిలాక్స్ అవడానికి వీలుండదు. ప్రతీ మ్యాచ్‌లో తనను తాను నిరూపించుకుంటూనే ఉండాలి. ఒక్కసారి విఫలమైతే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి యువ క్రికెటర్లు రెడీగా ఉన్నారు. దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ ద్వారా ఎంతో మంది టాలెంటెంట్ క్రికెటర్లు బెంచ్‌పై సిద్దంగా ఉన్నారు. తమకు అవకాశం వస్తే తమని తాను నిరూపించుకోవడానికి వెనకడుగు వేయడం లేదు. తాజాగా ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ రాణించడంతో ఆ ప్రభావం సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌పై పడింది. గతంలో ఒక మ్యాచ్‌లో విఫలమైనా ధావన్‌ను కొనసాగించే వాళ్లు. కానీ మారిన పరిస్థితుల్లో టీమ్ మేనేజ్‌మెంట్ అలాంటి ఛాన్స్ తీసుకోవడం లేదు. అవసరమైతే ఎంత సీనియర్‌ను అయినా పక్కన పెడతామనే సందేశాన్ని ధావన్‌ను తప్పించడం ద్వారా చెప్పకనే చెప్పింది.
వరల్డ్ కప్ ఆశలు గల్లంతా?
శిఖర్ ధావన్ ఒకప్పుడు టీమ్ ఇండియా మూడు ఫార్మాట్లలో ఆడిన క్రికెటర్. గబ్బర్ క్రీజ్‌లో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు హడల్. కానీ పేలవ ఫామ్‌తో తొలుత టెస్ట్ క్రికెటర్ జట్టులో స్థానం కోల్పోయాడు. ఇటీవల గాయాల కారణంగా రెగ్యులర్ ఓపెనర్‌గా రావడం లేదు. చాలా రోజుల తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 ఆడిన శిఖర్ ధావన్.. పూర్తిగా విఫలమయ్యాడు. అతడి స్థానంలో తీసుకొని వచ్చిన ఇషాన్ కిషన్ రాణించడంతో ఇప్పుడు గబ్బర్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 ప్రారంభానికి ముందు భారత జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఒక విషయం స్పష్టం చేశాడు. ఈ సిరీస్ ద్వారా ఈ ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్ కప్ జట్టులో ఎవరు ఉంటారనే దానికి ఒక అవగాహనకు వస్తామని చెప్పాడు. అంతే సీనియర్లు విఫలమైన చోట కుర్రాళ్లతో పరీక్షించడం మొదలు పెట్టారు. ఈ టెస్టులో ఇషాన్ కిషన్ పాస్ అవడంతో శిఖర్ స్థానం గల్లంతయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు ఓపెనర్‌గా రోహిత్ శర్మకు కిషన్ చక్కని జోడని విమర్శకులు కూడా అంటున్నారు. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మతో కిషన్ ఎన్నో మ్యాచ్‌లో ఆడాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో వీరిద్దరి జోడి హిట్ అవుతుందని అంటున్నారు.
అతడే బెస్ట్ చాయిస్..
టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కచ్చితంగా వరల్డ్ కప్ జట్టులో ఉంటాడు. అతడికి ఓపెనర్‌గా ఇప్పుడు కేఎల్ రాహుల్ లేదా ఇషాన్ కిషన్‌లను పరిశీలిస్తున్నారు. రోహిత్ శర్మకు వీరిద్దరి నుంచి గట్టి పోటీ ఎదురు కానున్నది. ఇషాన్ కిషన్ ఎటాకింగ్ క్రికెట్ అతడికి కలిసొచ్చే అంశం. మొదటి బంతి నుంచే ప్రత్యర్థులపై విరుచుకపడటం ఇషాన్ స్టైల్. ఇక సిక్సులు కొట్టడంలో ధావన్ కంటే కిషన్ మెరుగైన స్థానంలో ఉన్నాడు. మరోవైపు ఇషాన్ ఒక స్పెషలిస్ట్ వికెట్ కీపర్. దీంతో రిషబ్ పంత్ ఏదైనా కారణంగా మ్యాచ్‌కు దూరమైతే కిషన్ ఆ బాధ్యతలు చేపట్టగలడు. కానీ ధావన్ కేవలం బ్యాట్స్‌మాన్ మాత్రమే. ఏ విధంగా చూసుకున్నా.. ధానవ్‌కు ఇషాన్ కిషన్ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నది. అయితే ఒక్క మ్యాచ్‌తోనే కిషన్ గురించి ఒక నిర్ణయానికి రాలేమని.. అతడు మెరుగైన బ్యాట్స్‌మెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అదే సమయంలో అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో ఎలా నిలదొక్కుకుంటాడో చూడాల్సి ఉన్నది. ఎంతో అనుభవం ఉన్న శిఖర్ ధావన్‌ను వరల్డ్ కప్ జట్టు నుంచి తప్పిస్తారనేది నిజం కాకపోవచ్చని ఒక క్రికెట్ విశ్లేషకుడు అన్నాడు.