టీమ్ ఇండియాకు ముగిసిన క్వారంటైన్

by Shyam |
Team India-2
X

దిశ, స్పోర్ట్స్: పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ కోసం శ్రీలంక వెళ్లిన టీమ్ ఇండియా కొలంబోలో మూడు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్నది. గురువారం భారత పరిమిత ఓవర్ల జట్టు క్రికెటర్లు తమ హోటల్ గదుల నుంచి బయటకు వచ్చి స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేశారు. ఇండియాలో 14 రోజలు, శ్రీలంకలో 3 రోజుల పాటు వరుసగా క్వారంటైన్‌లో ఉన్న టీమ్ ఇండియా క్రికెట్లకు ఒక్కసారిగా స్వేచ్చ లభించడంతో హాయిగా సమయాన్ని గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. శిఖర్ ధావన్ తొలి సారిగా టీమ్ ఇండియా కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించబోతున్నాడు. గతంలో ఐపీఎల్‌లో కెప్టెన్‌గా చేసిన అనుభవం అతడికి ఉన్నది. చరిత్రలో తొలిసారి టెస్టు జట్టు ఒక దేశంలో పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు మరో దేశంలో పర్యటిస్తున్నది. బీసీసీఐ దీన్ని ఒక ప్రయోగాత్మక పర్యటనగా అభివర్ణించింది. జులై 13 నుంచి వన్డే సిరీస్, 22 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్నది.

Advertisement

Next Story