- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఉపసర్పంచ్ ఎన్నికకు భారీ బందోబస్తు.. దాడులు జరిగినా బెదరని..!
దిశ, ఘట్కేసర్ : మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని ఘట్కేసర్ మండలం కాచవాని సింగారం పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక గురువారం వాడివేడిగా జరిగింది. ఉపసర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులను ప్రలోభాలకు గురిచేసినా సభ్యులు ఏ మాత్రం లొంగకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. గ్రామంలో ఒక దశలో కాంగ్రెస్ వార్డ్ సభ్యుల ఆస్తులను ధ్వంసం చేసినా కూడా భయపడకుండా వార్డు సభ్యులు అందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఆ పార్టీ అభ్యర్థి శెట్టిపల్లి గీతను ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నారు.
ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులకు అండగా మండల పార్టీ అధ్యక్షులు కర్రే రాజేష్ నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ వైస్ చైర్మన్ మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్‌లు తోటకూర వజ్రేష్ యాదవ్, హరివర్ధన్ రెడ్డి నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలను, నాయకులను సమీప మున్సిపల్ అధ్యక్షులను, కార్పోరేషన్ అధ్యక్షులను, మున్సిపల్ కార్పొరేటర్లను కౌన్సిలర్‌లను, మండల శాఖ, గ్రామశాఖలకు చెందిన వివిధ స్థాయిల్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులను కాచవాని సింగారం గ్రామానికి పిలిపించి వార్డు సభ్యులకు అండగా నిలబడ్డారు. చివరగా ఉప సర్పంచ్ ఎన్నిక జరిపించుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. దీంతో ఇన్నిరోజులుగా గ్రామంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ ఎన్నిక సందర్బంగా గ్రామంలో భారీగా పోలీసులు మోహరించి గట్టి బందోబస్తు కల్పించారు.