- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అకస్మాత్తుగా ఉప్పొంగిన వాగు.. తృటిలో తప్పిన పెనుప్రమాదం
దిశ, సిరికొండ : గొర్రెలు మేపడానికి వెళ్లిన కాపరులు ప్రమాదవశాత్తు చీక్‌మాన్ వాగులో చిక్కుకుపోయారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాంపూర్ గ్రామంలో గురువారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. చీక్‌మాన్ వాగుకు నాలుగు వైపులా మైదాన ప్రాంతం ఉండటంతో సిరికొండ గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు అబ్బన రవి, దత్తు అంజయ్య గొర్రెలను మేపుతున్నారు.
ఎగువ భాగాన భారీవర్షం కురవడంతో అకస్మాత్తుగా వచ్చిన వరదతో వాగు పొంగి పొర్లింది. దీంతో కాపరులు వాగు మధ్యలో చిక్కుకున్నారు. వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు తహసీల్దార్ సర్ఫరాజ్‌కు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు చెప్పారు. వెంటనే పోలీసులు, గ్రామస్తులు కలిసి ఆ ముగ్గురు కాపర్లను తాడు సాయంతో బయటకు తీసుకొచ్చారు. వాగు మధ్యలోనే దాదాపుగా 300 గొర్రెలు కూడా చిక్కుకున్నాయి. వాగు ఉధృతి తగ్గిన తర్వాత వాటిని రక్షించడం జరుగుతుందని ఎమ్మార్వో తెలిపారు. కాపరులను రక్షించిన వారిలో పోలీసులు,0 గ్రామస్తులు పెంటన్న, చిన్నరాజన్న, అశోక్, ఆనందరావు, రవి ఉన్నారు.
- Tags
- adilabad