శేఖర్ కమ్ముల గ్రీన్ ఇండియా చాలెంజ్!

by Shyam |
శేఖర్ కమ్ముల గ్రీన్ ఇండియా చాలెంజ్!
X

దిశ, వెబ్‌డెస్క్:
గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌ను అభినందించారు. తన ప్రజెంట్ మూవీ ‘లవ్ స్టోరీ’ సెట్స్‌లోనే మొక్కలు నాటిన ఈ సెన్సిబుల్ డైరెక్టర్.. మూవీ యూనిట్ అందరినీ గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు నామినేట్ చేశారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి.. బంధువులు, మిత్రులను నామినేట్ చేస్తూ ఈ చెయిన్ కొనసాగించాలని కోరారు.

https://twitter.com/baraju_SuperHit/status/1314161957612658691?s=19

సమాజం పట్ల బాధ్యతగా ఉండే శేఖర్ కమ్ముల లాక్‌డౌన్‌లో ఫ్రంట్ వారియర్స్‌కు అభినందనలు తెలుపుతూ పలు కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే తిండి లేక బాధపడుతున్న ట్రాన్స్‌జెండర్లకు కూడా ఆర్థికంగా సాయం చేశారు. ఇక అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘లవ్ స్టోరీ’ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఇప్పటికే విడుదలైన సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోగా.. సినిమా హిట్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నాడు చైతు. అందుకే ఓటీటీలో కాకుండా థియేటర్‌లోనే విడుదల చేయాలని అనుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది.

Advertisement

Next Story