నిజంగా ప్రేమ అంత గొప్పదా.. యాసిడ్ దాడి చేసినా..!

by Anukaran |   ( Updated:2021-12-25 09:39:13.0  )
నిజంగా ప్రేమ అంత గొప్పదా.. యాసిడ్ దాడి చేసినా..!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రేమ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అంటారు ప్రేమికులు. అవును ఇలాంటి విషయాల గురించి విన్నప్పుడు నిజమే అనిపిస్తుంది. టర్కీకి చెందిన బేర్ఫీన్ ఒజెక్ అనే యువతి ఓజేన్ సెల్టీ అనే యువకుడిని ప్రేమించింది. ప్రేమ లో చిన్న చిన్న గొడవలు సహజం. అయితే ఒక రోజు వీరిద్దరి మధ్య గొడవ పెరిగి పెద్దదయ్యింది. దాంతో కోపం తట్టుకోలేక సెల్టీ యాసీడ్ తీసుకుని బేర్ఫీన్ ముఖం మీద చల్లాడు. దాంతో ఆమె ఆస్పత్రి పలైంది. ఇక సెల్టీ తన మానాన తను వేరే దేశానికి వెల్లిపోయాడు. అయితే కొంత కాలానికి తన తప్పుతెలసుకున్నాడు.

తిరిగి ఆమె పాదాల దగ్గరికి చేరుకున్నాడు. తనను క్షమించమని పశ్చాత్తాప్పడ్డాడు. అయితే ప్రేమంటేనే క్షమాగుణం. దాంతో బెర్ఫీన్ తన తప్పును మన్నించింది. అంతే కాదు అతడిని పెళ్లి చేసుకోవడానికి కూడా ఒప్పుకుంది. ఇద్దరూ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే ఈ వార్త ఆ నోటా ఈ నోటా పాకి చివరికి సోషల్ మీడియాలో రచ్చకెక్కింది. విషయం తెలిసిన నెటిజన్లు కొందరు ఆమెను సూపర్ బెర్ఫీన్ అంటుంటే మరి కొదరేమో ఇదేం పని అని తప్పుపడుతున్నారు.

ఈ పోస్ట్ లను చదివిన బెర్ఫీన్ అతడు తన తప్పును తెలుసుకున్నాడు, అందుకే తిరిగి నా దగ్గరికి వచ్చాడు, అందుకే పెళ్లి చేసుకున్నాను, నాకు నా నిర్ణయం పై పూర్తి విశ్వాసం ఉంది అంటూ నెటిజన్లకు గట్టి సమాధానం ఇచ్చింది. నిజమేకదండి ప్రేమంటే ఎంత గొప్పది కదా. ప్రాణాలు తీయాలనుకున్న వ్యక్తిని కూడా ప్రాణంగా ప్రేమించడం కేవలం ప్రేమికులకు మాత్రమే సొంతం.

Advertisement

Next Story

Most Viewed