స్ట్రీట్ రోడ్‌‌కు బర్త్‌డే వేడుకలు.. అమెరికన్ వింత నిరసన

by Sujitha Rachapalli |
స్ట్రీట్ రోడ్‌‌కు బర్త్‌డే వేడుకలు.. అమెరికన్ వింత నిరసన
X

దిశ, ఫీచర్స్ : ‘పుట్టినరోజు’ ప్రతి ఒక్కరి జీవితంలో ఓ స్పెషల్ డే. ఆ ప్రత్యేకమైన రోజున తమకు నచ్చినవాళ్లను సర్‌ప్రైజ్ చేసేందుకు ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో బర్త్‌డే రోజున లైఫ్‌లో మరిచిపోలేని విధంగా ఉండేలా స్పెషల్ గిఫ్ట్స్ ప్రజెంట్ చేస్తుంటారు. కాగా ఈ మధ్య పలువురు తమ పెట్స్‌కు కూడా గ్రాండియర్‌గా బర్త్‌డే పార్టీ చేస్తున్నారు. అయితే ఓ యువతి మాత్రం విచిత్రంగా తాను నివసిస్తున్న వీధికి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించింది. నడిరోడ్డులో కేక్ కట్ చేసి, అందరికీ పంచింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోగా, తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఆ బర్త్‌డే సెలబ్రేషన్ వెనక ఓ ఆసక్తికరమైన స్టోరీ ఉంది.

ప్రతిరోజు ఇంటి ముందరకు వచ్చే మున్సిపల్ వ్యానులో కాకుండా.. ఎవరైనా వీధిలో చెత్త పడేస్తుంటే మనం ఏమాత్రం పట్టించుకోం. కాలనీ రోడ్లన్నీ పాడైపోయి, అలాగే వదిలేసినా సరే.. ఆ అడ్డదిడ్డమైన రోడ్డుపైనే నాలుగు తిట్లు తిట్టుకుంటూ వెళ్తాం తప్ప, అధికారుల దగ్గరకు వెళ్లి కనీసం అర్జీ కూడా పెట్టం. కానీ అమెరికాలోని న్యూ ఓర్లీన్స్ ప్రాంతానికి చెందిన టీనేజర్ నటాలీ నఖీన్ హార్వే మాత్రం అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపాలనుకుంది. అందుకే తమ వీధిలోని రోడ్డుకు బర్త్‌డే వేడుకలు చేసింది. తమ వీధిలోని రోడ్డు తవ్వి ఏడాది అవుతున్నా.. అధికారులు పనులు పూర్తి చేయడం లేదని చెప్పేందుకు ఆమె ఈ సరికొత్త నిరసన మార్గాన్ని ఎంచుకుంది. కాగా ఆమె చేసిన పనికి ‘సూపర్ థాట్.. అధికారులకు భలే బుద్ధి వచ్చేలా చెప్పావ్, కేక్ మీద పూర్తి సమస్య అర్థమవుతుంది. గుడ్ థాట్.. గ్రేట్ జాబ్’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

‘హ్యాపీ బర్త్ డే టు మై స్ట్రీట్ కన్‌స్ట్రక్షన్.. సరిగ్గా ఏడాది కిందట మా వీధి రోడ్డులో గొయ్యి తవ్వారు. ఏడాది తర్వాత సగానికి పైగా వీధిని అస్తవ్యస్తంగా మార్చేశారు. గతవారం ఆరడుగుల లోతైన గొయ్యి ఏర్పడింది’ అంటూ స్ట్రీట్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. అంతేకాదు కేక్‌ను కూడా ఆ వీధి రూపాన్ని తలపించేలా స్పెషల్‌ అండ్ కస్టమైజ్డ్‌గా తయారుచేయించింది. ఆ కేక్ మీద చిధ్రమైన రోడ్డుపై వర్కర్లు పనిచేస్తున్నట్లుగా, క్రేన్స్ రోడ్డు తవ్వుతున్న చిత్రాలతో పాటు ఒకవైపు గొయ్యి, ఇంకోవైపు రోడ్ క్లోజ్డ్ అనే బోర్డులు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed