- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బొద్దు గుమ్మ సోనాక్షి సిన్హా .. నటుడు శతృఘ్న సిన్హా కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కెరియర్ తొలినాళ్లలో వరుస హిట్లతో దూసుకుపోయిన ఈ భామ… ఈ మధ్య హిట్ కోసం చాలా కష్టపడుతోంది. నటనాపరంగా 100 శాతం మార్కులు కొట్టేసిన సోనాక్షి.. జనరల్ నాలెడ్జ్‌లో కొంచెం వీక్. అందుకే ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన సమయంలో రామాయణం గురించి ప్రశ్న ఎదురుకాగా సమాధానం చెప్పలేక పోయింది. దీంతో ఆమె ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది జరిగి చాలా రోజులు కాగా ఇప్పుడు మళ్లీ ఈ విషయాన్ని తెరమీదకి తెచ్చాడు నటుడు ముఖేష్ ఖన్నా. ఒకప్పుడు ప్రేక్షకుల ఆదరణ పొందిన ‘రామాయణం’, ‘మహాభారతం’ సీరియల్స్ పున: ప్రసారం అవుతున్న క్రమంలో సోనాక్షిపై కామెంట్ చేశాడు.
రామాయణం గురించి తెలియని సోనాక్షి లాంటి వారి కోసం ‘రామాయణం’ సీరియల్‌ను మళ్లీ ప్రసారం చేస్తున్నారని విమర్శలు చేశాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సోనాక్షి తండ్రి .. రామాయణం గురించి తెలియనంత మాత్రాన తానేమీ హిందువు కాకుండా పోదని పంచ్ ఇచ్చాడు. నా బిడ్డ విషయంలో నేను ఎప్పుడూ గర్వంగా ఫీల్ అవుతానని… తనకు తానుగా స్టార్‌గా ఎదిగన సత్తా సోనాక్షిదన్నాడు. కామెంట్స్ చేసే వారంతా రామాయణం గురించి పూర్తి అవగాహన ఉన్నవారైతే కాదు కదా అని తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తన గురించి, తన నాలెడ్జ్ గురించి వేరేవాళ్లు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఈ విధంగా తన బిడ్డ గురించి కామెంట్స్ చేసిన వారికి దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చిన శతృఘ్న సిన్హా .. కూతురిపై ఎంత ప్రేమ ఉందో నిరూపించుకున్నాడని అంటున్నారు నెటిజన్లు.
Tags:Sonakshi Sinha, Shatrughan Sinha, Bollywood