- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్.. షర్మిల సీక్రెట్ సర్వేలో సంచలన విషయాలు
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పార్టీ పెడతానని ప్రకటించిన షర్మిల మరో ముందడుగు వేశారు. తెలంగాణ వాదం గట్టిగా బలపడిన చోట పార్టీ పెడితే గెలుస్తానో లేదో అని గ్రౌండ్ లెవల్లో సీక్రెట్ సర్వేను చేపట్టినట్టు తెలుస్తోంది. ఇందుకోసం చెన్నైకి చెందిన నేషనల్ పొలిటికల్ కన్సల్టెన్సీ(ఎన్.పీ.సీ) అనే సంస్థను సంప్రదించినట్లు సమాచారం. దాదాపు మూడు నెలల నుంచి ఎవరికీ తెలియకుండా తెలంగాణలో వైఎస్సార్‌కు ఇంకా ఎంత మంది అభిమానులు ఉన్నారు? ఆయన సంక్షేమ పథకాలపై ప్రజల్లో ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? తెలంగాణలో పార్టీ పెడితే షర్మిలను ఆదరిస్తారా? లేదా? షర్మిల సీఎం కావాలంటే ఏం చేయాలి? నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నాయకులకు ధీటుగా ఎవర్ని రంగంలోకి దింపాలి? అసలు బలమైన నేతలెవరు? అనే అంశాలపై సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే సర్వే రిపోర్ట్ ప్రకారం 72 నియోజకవర్గాల్లో వైఎస్ పై అభిమానం చెక్కుచెదరలేదని సర్వే లో తేలిందట. పార్టీ ప్రకటన ముందే అన్ని ఏర్పాట్లు చేసుకుని షర్మిల రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. షర్మిల చేయించిన సీక్రెట్ సర్వే రాజకీయంగా సంచలనం రేపుతోంది.
పార్టీ చైర్మన్‌కు సర్వే విషయమే తెలియదట!
షర్మిల పార్టీ ఏర్పాటుకు ముందే లోటస్ పాండ్ నేతల్లో స్పష్టత కరువైంది. పార్టీలో ఏం జరుగుతోందో కూడా అధికార ప్రతినిధులకు తెలియకపోవడం గమనార్హం. సర్వే అంశంలో ఈ విషయం తేటతెల్లమైంది. సర్వే చేపట్టారన్న విషయం అత్యంత సన్నిహితుడు, పార్టీ చైర్మన్ వాడుక రాజ గోపాల్ కే తెలియకపోవడం గమనార్హం. అయితే ఇతర నేతలు మాత్రం సర్వే వాస్తవమేనని చెబుతున్నారు. పార్టీ ఏర్పాటుకు ముందే నేతల్లో భిన్నాభిప్రాయాలు రావడం నాయకులను కలవరానికి గురి చేస్తోంది.