'కాంట్రాక్టు కాదు దొర.. పర్మినెంట్‌గా రిక్రూట్ చేయండి'

by Shyam |   ( Updated:2021-04-26 06:39:15.0  )
కాంట్రాక్టు కాదు దొర.. పర్మినెంట్‌గా రిక్రూట్ చేయండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ వైద్య శాఖలో 755 ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించడంపై వైఎస్ షర్మిల తనదైన శైలితో స్పందించారు. ‘భర్తీ చేయాల్సింది కాంట్రాక్టు పద్ధతిన కాదు దొర.. పర్మినెంట్ గా రిక్రూట్ చేయాలి’ అని ఆమె సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వైద్య శాఖలో సిబ్బంది సరిపడా లేకపోవడం వల్ల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసైనా ఖాళీగా ఉన్న 23,512 పోస్టులను భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

అలా చేస్తే అయినా ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారవుతారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా పోస్టులు భర్తీ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేయొద్దని, మొత్తం ఖాళీలను భర్తీ చేసి సిబ్బందికి పనిభారాన్ని తగ్గించాలని షర్మిల విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed