- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చేనెల 1న ఆదివాసులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం
దిశ, తెలంగాణ బ్యూరో: రాజన్న రాజ్యస్థాపనే లక్ష్యంగా తెలంగాణలో పార్టీని స్థాపించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయ షర్మిల కుల సంఘాలే టార్గెట్ గా ముందుకు వెళ్తున్నారు. సంక్షేమం, సమానత్వం, స్వయం సమృద్ధి ఎజెండాగా పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. ప్రజలందరికీ దగ్గరయ్యేందుకు జిల్లాల వారీగా పర్యటనలు కొనసాగిస్తున్నారు. కులసంఘాల వారీగా సభలు నిర్వహిస్తూ ఒక్కొక్కరిగా అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో దళిత భేరి పేరిట బహిరంగ సభను నిర్వహించిన షర్మిల వరుస సమావేశాలు నిర్వహించి పాదయాత్ర కోసం సన్నాహకాలు చేపడుతున్నారు.
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తన తండ్రి వైఎస్సార్ బాటలోనే షర్మిల కూడా నడవనున్నారు. వచ్చేనెల 20వ తేదీన షర్మిల ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్రను ప్రారంభిస్తున్నారు. తన తండ్రి సెంటిమెంట్‌నే ఆమె కొనసాగిస్తున్నారు. చేవెళ్ల నుంచే యాత్రను ప్రారంభించి తిరిగి చేవెళ్లలోనే ముగించేలా ప్లాన్ చేసుకున్నారు. దీని కోసం ఇప్పటి నుంచే ఆమె సంసిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా ఈనెల 30వ తేదీన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం జుక్కల్ లో పర్యటించనున్నారు. అక్టోబర్ 1వ తేదీన లోటస్‌పాండ్ లో ఆదివాసీలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే అక్టోబర్ 3వ తేదీన ఉమ్మడి మమబూబ్‌నగర్ జిల్లా కోస్గిలో ‘బీసీ గర్జన’ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఆమె సిద్ధమయ్యారు.
ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దళిత భేరి పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించిన షర్మిల ‘బీసీ గర్జన’ పేరిట మరో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ సభకు తరలిరావాలని పలువురు మేధావులు, బీసీ సంఘం నేతలకు ఆహ్వానం అందించినట్లుగా తెలుస్తోంది. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు ఇప్పటికే ఆహ్వానం అందించినట్లు వైఎస్సార్టీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లలో వైఎస్సార్టీపీ శ్రేణులు నిమగ్నమయ్యాయి.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై షర్మిల ఇప్పటినుంచే ఫోకస్పెడుతున్నారు. తిరుమలగిరి పట్టణంలో నిర్వహించిన దళిత భేరి బహిరంగ సభలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ అధికార ప్రతినిధి ఏపూరి సోమన్నను షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు బీసీ గర్జనలో సైతం తమ పార్టీ తరుపున మరో ఎమ్మెల్యే అభ్యర్థిని షర్మిల ప్రకటిస్తుందా? లేదా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ప్రకటిస్తే ఎవరి పేరును షర్మిల అనౌన్స్ చేస్తారోననే టెన్షన్ అక్కడి నేతల్లో మొదలైంది. ఈ అంశంపై అటు పార్టీ శ్రేణుల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
- Tags
- BC