- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శార్దుల్ ఠాకూర్ బెస్ట్ చాయిస్.. టీమిండియాకు ఎంఎస్కే ప్రసాద్ కీలక సూచన
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా సౌతాఫ్రికా గడ్డ మీద టెస్టు సిరీస్ కొట్టేందుకు 29 ఏండ్లుగా పోరాడుతూనే ఉంది. సారథులు మారినా.. ఆటగాళ్లు మారినా సఫారీల ఇలాకాలో మాత్రం టెస్టు సిరీస్‌ను గెలవలేకపోయింది. దీంతో సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26న జరిగే టెస్టు మ్యాచ్ మీద టీమిండియా కన్నేసింది. ఇప్పటికే జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
ఈ సమయంలో మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ కీలక సూచన చేశాడు. సఫారీలను ఎదుర్కొనేందుకు పటిష్టమైన బౌలింగ్ విభాగం కావాలని చెబుతూనే.. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్‌లతో పాటు సెంచూరియన్‌లో తొలి టెస్టులో ఆడేందుకు శార్దూల్ ఠాకూర్ ఉత్తమ ఎంపిక అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది టెస్టు మ్యాచుల్లో మంచి ఫామ్ కొనసాగించాడని గుర్తు చేశాడు.
ముఖ్యంగా గబ్బా(ఆస్ట్రేలియా), ది ఓవల్ (ఇంగ్లాండ్) టెస్టు మ్యాచుల్లో అదరగొట్టాడని చెప్పుకొచ్చాడు. దీనికి తోడు 7వ స్థానంలో ఒక స్థిరమైన బ్యాటర్‌గా తాను అర్హుడని చెప్పాడు. ఇక లోయర్ ఆర్డర్‌లో రవిచంద్రన్ అశ్విన్ కూడా బ్యాటర్‌గా రాణించగలడని ధీమా వ్యక్తం చేశారు ఎంఎస్కే ప్రసాద్.