మలయాళం నేర్చుకుంటేనే సినిమాల్లో నటించాలా? : శాన్వి

by Jakkula Samataha |   ( Updated:2021-02-24 08:35:26.0  )
shanvi
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ శాన్వీ శ్రీవాత్సవ.. తెలుగులో ‘లవ్‌లీ’, ‘రౌడీ’ వంటి సినిమాలతో గుర్తింపు పొందింది. తర్వాత తమిళ, కన్నడ ఇండస్ట్రీలో బిజీ అయిపోయిన భామ.. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతోంది. అబ్రిడ్ షైన్ దర్శకత్వంలో నివిన్ పౌలీ, అసిఫ్ అలీ లీడ్ రోల్స్‌ చేస్తున్న ‘మహవీర్యర్’ సినిమాలో ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది.

కాగా, సినిమా చిత్రీకరణకు ముందు వర్క్ షాప్స్‌కు కూడా అటెండ్ అయిన భామ.. ప్రస్తుతం గుర్రపు స్వారీ, రాజస్థానీ ఫోక్ డ్యాన్స్ నేర్చుకునే పనిలో ఉన్నానని తెలిపింది. ఇక మలయాళం లాంగ్వేజ్ స్కిల్స్ గురించి ప్రశ్నించగా.. వారం లేదా నెలరోజుల్లో భాషపై పూర్తి పట్టుసాధిస్తానని అనుకోవట్లేదని, కొద్ది కొద్దిగా నేర్చుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పింది. వారణాసికి చెందిన తను తెలుగు, కన్నడ భాషలు నేర్చుకున్నానని.. త్వరలోనే మలయాళం కూడా అనర్గళంగా మాట్లాడుతానని హామీ ఇచ్చింది.May be an image of 1 person

May be an image of 1 person

Advertisement

Next Story