తెలుగు సింగర్‌పై విమర్శలు.. సోషల్ మీడియాలో మీమ్స్

by Shyam |
తెలుగు సింగర్‌పై విమర్శలు.. సోషల్ మీడియాలో మీమ్స్
X

దిశ, సినిమా : ‘ఇండియన్ ఐడల్ 12’ షో స్టార్ట్ అయినప్పటి నుంచి వివాదాల మధ్యే నడుస్తోంది. కంటెస్టెంట్స్ ఎలా పాడినా సరే పాజిటివ్ కామెంట్స్ ఇవ్వాలని నిర్వాహకులు సూచిస్తున్నారని గెస్ట్‌గా వచ్చిన జడ్జ్‌లు ఆరోపించడం, ఈ అలిగేషన్స్‌ను నిర్వాహకులు వ్యతిరేకించడం‌.. ఇలా విమర్శలు, ప్రతివిమర్శలతో సోషల్ మీడియాలో హాట్ న్యూస్ అయిపోయింది. ఇదిలా ఉంటే ఈ షోలో తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ఆడియన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది.

ప్రతీ పాటకు యోడెలిన్ స్టైల్, ఐడియాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ యాడ్ చేసి పాటను పాడుచేస్తోందని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. ఈ వీక్ ఆడియన్స్ ఫేవరేట్ కాన్సెప్ట్‌లో భాగంగా ప్రియాంక నటించిన ‘7 ఖూన్ మాఫ్’ చిత్రం నుంచి ‘డార్లింగ్’ సాంగ్ పాడిన షణ్ముఖ ప్రియపై కామెంట్స్ చేస్తున్నారు. ప్రతీ వీక్ మాకేంటి ఈ టార్చర్.. అంత మంచి ఒరిజినల్ సాంగ్‌ను ఎందుకు ఇలా ఖూనీ చేస్తుందని మండిపడుతున్నారు. ఈ నాయిస్ బాక్స్‌ను ఇంకెన్ని రోజులు భరించాలని నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు. దేశంలోనే అత్యుత్తమ సింగర్‌గా జడ్జ్‌లు ప్రశంసలు కురిపిస్తుండగా… అసలు ఆమెను ఎందుకు పొగుడుతున్నారో కూడా అర్ధం కావడం లేదని సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

Next Story