ఆ విషయంలో ధోనీకి రుణపడి ఉంటా : షేన్ వాట్సన్

by Shyam |
ఆ విషయంలో ధోనీకి రుణపడి ఉంటా : షేన్ వాట్సన్
X

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ టాలెంట్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆసీస్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన విషయం తెలిసిందే. అలాగే తాను ఐపీఎల్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లోనూ వాట్సన్ సహకారం ఎంతో ఉంది. కాగా, గతేడాది ఐపీఎల్‌లో తన ప్రదర్శన గురించి షేన్ వాట్సన్ పలు విషయాలు పంచుకున్నాడు. ప్రారంభ మ్యాచుల్లో తాను సరిగా పరుగులు చేయలేకపోయానని, ఆ సమయంలో కెప్టెన్ ధోనీ, కోచ్ ఫ్లెమింగ్ తనపై ఎంతో నమ్మకం ఉంచారని చెప్పాడు. ’10 మ్యాచుల పాటు అనుకున్నంత మేర రాణించలేక పోయా.. తన ప్రదర్శన చూసి రెండో మ్యాచ్‌కే పక్కన పెడతారనుకున్నా.. కానీ వాళ్లలా చేయలేదని’ చెప్పాడు. అయితే వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చివరి మ్యాచుల్లో జట్టు గెలుపునకు చాలా కృషి చేశానని వాట్సన్ తెలిపాడు.

2018లో చెన్నై జట్టు టైటిల్ గెలవడంలో వాట్సన్‌ది కీలక పాత్ర. 2019లో కూడా ఫైనల్లో చివరి వరకు పోరాడాడు. ఒకవైపు కాలి గాయంతో రక్తం వస్తున్నా చెన్నైని గెలుపు తీరాలకు చేర్చడానికి ప్రయత్నించాడు. కానీ, చివరకు ముంబై కప్ ఎగరేసుకొని పోయింది. అయితే వాట్సన్ పట్టుదలకు అభిమానులంతా అభినందనలతో ముంచెత్తారు. ఆ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.

Tags : Shane Watson, MS Dhoni, Chennai Super Kings, IPL

Advertisement

Next Story

Most Viewed