- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్రికెట్‌కు షేన్ వాట్సన్ వీడ్కోలు
దిశ, స్పోర్ట్స్ : క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న షేన్ వాట్సన్ అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మంగళవారం తన యూట్యూబ్ ఛానల్‌లో ఒక వీడియో ద్వారా వాట్సన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆస్ట్రేలియాకు చెందిన వాట్సన్.. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. అంతకు ముందు వాట్సన్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు.
‘నేను కోరుకున్న దానికన్నా క్రికెట్ తనకు ఎక్కువే ఇచ్చింది. తనకు చిన్నతనం నుంచే క్రికెట్‌పై అమితమైన ప్రేమ ఉండింది. తాను జాతీయ జట్టుకు క్రికెట్ ఆడతానని చిన్నప్పుడే అమ్మకు చెప్పాను. ఆ కల నెరవేర్చుకున్నాను. తన ఆటపట్ల తాను చాలా సంతోషంగా ఉన్నాను’ అని వాట్సన్ తన రిటైర్మెంట్ సందర్భంగా చెప్పాడు. దాదాపు 20 ఏళ్ల పాటు క్రికెట్ కెరీర్ కెరీర్ కొనసాగించిన వాట్సన్.. ఆస్ట్రేలియా తరపున 59 టెస్టులు, 190 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 3731 పరుగులు, 75 వికెట్లు తీసుకున్నాడు. వన్డేల్లో 5757 పరుగులు చేసిన వాట్సన్ ఖాతాలో 9 సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో 168 వికెట్లు కూడా తీసుకున్నాడు.