- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా వ్యాక్సిన్ పై అపోహలు వద్దు: జడ్పీ ఫ్లోర్ లీడర్ నీరటి తన్వీరాజ్
దిశ రాజేంద్రనగర్ : కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జడ్పీ ఫ్లోర్ లీడర్ శంషాబాద్ జెడ్పీటీసి నీరటి తన్వీరాజ్ తెలిపారు. శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ ప్రభుత్వాసుపత్రిలో ఆమె కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వైరస్ సెకండ్ వేవ్ అంతకంతకు విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రజలందరూ బహిరంగ ప్రదేశాల్లో ఖచ్చితంగా మాస్కులు ధరించి బహుదూరం పాటించాలని పిలుపునిచ్చారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఎవరూ అపోహలకు పోవద్దని అందరూ కచ్చితంగా కరుణ వ్యాక్సిన్ తీసుకొవాలని అన్నారు. అవసరం అయితే తప్ప బయటికి రాకూడదని కోవిద్ 19 నిబంధనలు పాటిస్తే మనతోపాటు మన కుటుంబ సభ్యులను కూడా కాపాడుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దివ్య,నాయకులు నీరటి రాజు, శేఖర్,కుమార్ గౌడ్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.