డోంట్ వర్రీ డార్లింగ్.. పాస్ అయిపోతావ్ : శిల్పా శెట్టి సిస్టర్

by Shyam |
shamitha-shetty
X

దిశ, సినిమా : పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ నేపథ్యంలో శిల్పాశెట్టికి తన చెల్లి షమితా శెట్టి సపోర్ట్‌గా నిలిచింది. శిల్ప కమ్‌బ్యాక్ మూవీ ‘హంగామా2’ డిస్నీ+హాట్‌స్టార్‌లో శుక్రవారం రిలీజ్ కాగా.. షమిత ఆ ఫిల్మ్ పోస్టర్‌ను షేర్ చేయడమే కాక, అక్కకు మద్దతు తెలుపుతూ మెసేజ్ పోస్ట్ చేసింది. ‘ఆల్ ది బెస్ట్ మై డార్లింగ్, 14 ఏళ్ల గ్యాప్ తర్వాత నువ్వు నటించిన సినిమా రిలీజ్ అవుతోంది. దీనికోసం నీతో పాటు యూనిట్ మొత్తం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు.

లైఫ్‌లో హర్డిల్స్ ఎదురైన ప్రతీసారి మరింత బలంగా నిలబడ్డావు. ఇది కూడా పాస్ అయిపోతావ్’ అంటూ ‘హంగామా2’ టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. కాగా శుక్రవారం రిలీజైన సినిమాను చూడాల్సిందిగా శిల్పాశెట్టి తన ఫ్యాన్స్‌ను కోరింది. పరేష్ రావల్, మీజాన్ లీడ్ రోల్స్ పోషించిన ఈ చిత్రం డైరెక్టర్ ప్రియదర్శన్‌కు కూడా బాలీవుడ్‌లో కమ్‌బ్యాక్ మూవీ కావడం విశేషం.

Advertisement

Next Story