- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోహ్లీ గురించి సీక్రెట్ చెప్పిన షమీ..
మహ్మద్ షమీ.. ఈ టీమిండియా పేసర్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. కొవిడ్-19 కారణంగా ఆటకు విరామం దొరకడంతో సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో ముచ్చటిస్తున్నాడు. ఈ క్రమంలో కోహ్లీని ఎలా అవుట్ చేయాలో సీక్రెట్ బయటపెట్టాడు. ప్రపంచంలో నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ అయిన కోహ్లీ.. తన వికెట్‌ను కోల్పోయేందుకు అస్సలు ఇష్టపడడని, అలాంటి కోహ్లీని అవుట్ చేయడం బౌలర్లందరికీ సవాల్ వంటిదని చెప్పాడు. అయితే, ఐపీఎల్‌లో ప్రత్యర్థిగా, టీమిండియాలో సహచరుడు, కెప్టెన్‌గా ఉన్న కోహ్లీని చాలా దగ్గర నుంచి గమనించిన షమీ.. కొన్ని విషయాలు వెల్లడించాడు. ‘ఎత్త గొప్ప బ్యాట్స్‌మన్ అయినా అతనికీ కొన్ని బలహీనతలు ఉంటాయని.. వాటిని తెలుసుకోవడమే బౌలర్ల పని అని షమీ చెబుతున్నాడు. ఇతర ప్లేయర్లతో ఆడటం ద్వారా బౌలర్లకు ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి.. అప్పుడే ఏ బ్యాట్స్‌మన్ బలహీనత ఏంటో తెలిసిపోతుంది. కోహ్లీ కూడా సరిగా ఆడని జోన్‌లో బౌలింగ్ చేస్తే వికెట్ తీయడం కష్టమేమీ కాదని’ అన్నాడు. అతను అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అతడికి కూడా బలహీనతలు ఉంటాయి.. వాటిని కనిపెట్టి బౌలింగ్ చేయాలని అన్నాడు.
తనకు కోహ్లీ బలహీనతలపై సరైన అవగాహన లేని సమయంలోనే ఐపీఎల్‌లో చాలా సార్లు అవుట్ చేశానని షమీ తెలిపాడు. అయితే, ఒక కెప్టెన్‌గా కోహ్లీ తన బౌలర్లకు చాలా స్వేచ్ఛను ఇస్తాడని.. అందుకే అతని సారథ్యంలో చక్కని ఫలితాలు వస్తున్నాయని షమీ చెప్పుకొచ్చాడు.
Tags: Kohli, Shami, IPL, Team India, Secret, Weakness