RBI: కొవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు

by Anukaran |   ( Updated:2021-05-20 00:50:32.0  )
RBI Governor Shaktikanta Das
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్ లాంటి ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)లు ఆర్‌బీఐ ప్రకటించిన ఉపశమన చర్యలను వేగవంతం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కోరారు. అదేవిధంగా తమ బ్యాలెన్స్ షీట్లను మెరుగ్గా కొనసాగించే చర్యలను తీసుకోవాలని దాస్ తెలిపారు. బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో జరిగిన వర్చువల్ సమావేశంలో దాస్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న కఠిన సమయంలో వ్యక్తులు, వ్యాపారులకు రుణ సదుపాయాలను విస్తృతంగా అందించడంలో బ్యాంకులు పోషిస్తున్న కీలక పాత్ర బాగుందని దాస్ తెలిపారు. అలాగే, ఆర్థిక రంగంపై ప్రస్తుత పరిస్థితుల ప్రభావం, చిన్న రుణ గ్రహీతలతో సహా వివిధ రంగాలకు రుణాలివ్వడం, ఆర్‌బీఐ తీసుకుంటున్న కరోనా సంబంధిత విధాన చర్యల అమలు వంటి కీలక అంశాల గురించి శక్తికాంత దాస్ బ్యాంకుల వారితో చర్చించారు. ఈ సమావేశంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు ఎం కె జైన్, ఎం రాజేశ్వర్ రావు, మైఖెల్ డి పాత్ర, టీ రవి శంకర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed