షూటింగ్స్ మొదలైనా ‘శ్రద్ధ’ కష్టమే : శక్తి కపూర్

by Shyam |
షూటింగ్స్ మొదలైనా ‘శ్రద్ధ’ కష్టమే : శక్తి కపూర్
X

సాహో భామ శ్రద్ధాకపూర్ బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్. బెస్ట్ యాక్టర్ కమ్ డ్యాన్సర్ అయిన ఈ క్యూట్ భామకు అవకాశాలకేం కొదువలేదు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఇన్ని రోజులు సినిమా షూటింగ్స్ లేకపోవడంతో శ్రద్ధ ఇంట్లోనే గడిపింది. కాగా త్వరలోనే షూటింగ్స్ మొదలుపెట్టేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో నిర్మాతలు, దర్శకులు షూటింగ్ స్పాట్‌లో ఎలా ఉండాలి ? అనే దానిపై మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాను మాత్రం షూటింగ్స్‌కు దూరంగానే ఉంటానంటున్నాడు శ్రద్ధా కపూర్ తండ్రి.. శక్తి కపూర్. అంతేకాదు తన కూతురిని కూడా షూటింగ్‌లో పాల్గొనేందుకు అనుమతించనని చెప్తున్నాడు. ‘కరోనా వల్ల చాలా ముప్పు పొంచి ఉందని.. భవిష్యత్తులో దీనివల్ల ఘోరమైన పరిస్థితులు చవిచూడాల్సి వస్తుందని’ చెప్పాడు. ఇప్పుడు షూటింగ్స్ ప్రారంభించి హాస్పిటల్ బిల్లులు కట్టుకునే బదులు.. మరికొన్ని రోజులు ఆగితే బాగుంటుందని నిర్మాతలు, దర్శకులకు సలహా ఇచ్చాడు. ఇప్పటికీ బయట చాలా బ్యాడ్ కండిషన్స్ ఉన్నాయని హెచ్చరించాడు.

Advertisement

Next Story