- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బర్త్‌డే గిఫ్ట్‌గా స్మోకింగ్ మానేయమంది: శక్తి కపూర్
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రస్తుతం మాల్దీవ్స్‌లో తన కజిన్ మ్యారేజ్ ఎంజాయ్ చేస్తోంది. మార్చి 3న తన పుట్టినరోజును ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి అక్కడే సెలబ్రేట్ చేసుకోనుండగా.. ఆమెకు ఎలాంటి బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వబోతున్నారన్న విషయంపై తండ్రి శక్తి కపూర్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా శ్రద్ధను పొగొడ్తలతో ముంచెత్తిన ఆయన.. శ్రద్ధ కన్నా మంచి వ్యక్తి ఈ లోకంలో ఉండరని, ఆమెలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ తనలో కూడా లేవని అన్నారు. తను ఉదారస్వభావం కలిగిన జంతు ప్రేమికురాలని చెప్పారు. సక్సెస్‌ఫుల్ కెరియర్ రన్ చేస్తున్నా.. ప్రతీ విషయంలో తండ్రి సలహా తీసుకోవాలనే ఆలోచనతో తనను గౌరవమిస్తూనే ఉంటుందన్నారు. శ్రద్ధపై తనకు ఎలాంటి ఫిర్యాదులు లేవని, ఆమెను ఓ గాడ్ గిఫ్ట్‌గా అభివర్ణించిన శక్తి.. ఏంజిల్ అంటూ కొనియాడారు. తనకు బర్త్‌డే గిఫ్ట్‌గా స్మోకింగ్ వదిలేయాలని అడిగిందని, ఓకే చెప్తూ ప్రామిస్ కూడా చేశానని తెలిపారు.
https://www.instagram.com/p/CL4NVQqnLKx/?utm_source=ig_web_copy_link
స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు తన స్టేజ్ పర్‌ఫార్మెన్స్ చూసి శ్రద్ధ నటిగా మారుతుందనుకున్నానని, కానీ ఓ ఇంటెలిజెంట్ స్టూడెంట్‌గా యూఎస్‌లో స్టడీస్ కంప్లీట్ చేసిందన్నారు. అయితే తను అనుకున్న విధంగా యాక్ట్రెస్‌గా మారుతూ ‘తీన్ పత్తి’ సినిమాకు సైన్ చేసిందని తెలిసి చాలా హ్యాపీగా అనిపించిందని శక్తి కపూర్ వెల్లడించారు.