స్వీయ నిర్బంధంలోకి క్రికెటర్లు.!

by Shyam |
స్వీయ నిర్బంధంలోకి క్రికెటర్లు.!
X

కరోనా మహమ్మారి ప్రభావంతో విదేశీ ప్రయాణాలు చేసిన వారిని ప్రభుత్వం క్వారంటైన్లకు పంపిస్తుండగా.. లాక్‌డౌన్లతో ప్రజలు కూడా స్వీయనిర్భంధంలోకి వెళ్లారు. ఈ క్రమంలో విదేశీ ప్రయాణం చేసిన బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబుల్ హసన్ అమెరికాలోని ఒక హోటల్‌లో క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాడు. ‘విమాన ప్రయాణంలో చాలా భయం అనిపించిందని.. అందుకే కరోనా నుంచి దూరం కావడానికి స్వీయ నిర్బంధం విధించుకోవాలని నిర్ణయించుకున్నట్లు’ షకీబుల్ చెప్పాడు. అంతే కాకుండా తాను తన కూతురిని మిస్ అవుతున్నట్లు ఒక వీడియో పోస్ట్ చేశాడు.

మరోవైపు శ్రీలంక ప్రభుత్వం విదేశీ ప్రయాణికులకు క్వారంటైన్ ప్రకటించడంతో మాజీ క్రికెటర్ కుమార సంగక్కర కూడా తన ఇంట్లోనే స్వీయ నిర్బంధం విధించుకున్నాడు. తనకు ఎలాంటి వైరస్‌ ప్రభావిత లక్షణాలు కనిపించలేదని, అయినా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్వీయ నిర్బంధంలో ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.

Tags: Cricketers, Corona effect, Bangladesh, Shakib Hasan, Sri Lanka Sangakkara

Advertisement

Next Story

Most Viewed