బీజేపీలో చేరిన షాహీన్‌బాగ్ నిరసనకారుడు..

by Shamantha N |
బీజేపీలో చేరిన షాహీన్‌బాగ్ నిరసనకారుడు..
X

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన కీలక బిల్లులో సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్(CAA) ఒకటి. ఇది చట్టరూపం దాల్చాక దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలసిందే. దేశంలోని ముస్లిం మైనార్టీలకు ఈ బిల్లు వ్యతిరేకంగా ఉందని జాతీయ పార్టీ కాంగ్రెస్ తో పాటు దాని మద్దతు దారులు నిరసనలకు పిలుపునిచ్చాయి. వాటన్నింటిలో దేశరాజధాని ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో జరిగిన నిరసనే హైలట్‌గా నిలిచింది.

అయితే, ఆ నిరసనల్లో నిర్విరామంగా పాల్గొన్న సామాజిక కార్యకర్త షాజాద్ అలీ ఆదివారం భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా, మరో నేత శ్యామ్ జాజు.. షాజాద్ అలీకి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ విషయంపై షాజాద్ మాట్లాడుతూ.. ముస్లిములకు భారతీయ జనతా పార్టీ శత్రువు అని తప్పుడు ప్రచారం జరుగుతోందని, దానిని అవాస్తవం అని నిరూపించడానికే తాను ఇందులో చేరినట్లు షాజాద్ చెప్పుకొచ్చారు. అయితే, సీఏఏపై నిరసనకారులతో కలిసి తాను వేదికను పంచుకుంటానని సంచలన ప్రకటన చేశారు. కాగా, షాజాద్ ప్రకటనపై బీజేపీ ఇంతవరకు స్పందించలేదు.

Advertisement

Next Story

Most Viewed