ఆలియాను కొత్తగా పరిచయం చేయక్కర్లేదు : షహీన్

by Shyam |
ఆలియాను కొత్తగా పరిచయం చేయక్కర్లేదు : షహీన్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ భామ ఆలియా భట్‌కు భారీ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన నటనతో ఎవరినైనా సరే ఇట్టే ఫిదా చేసే ఆలియా.. ఎల్లే ఇండియా సెప్టెంబర్ డిజిటల్ కవర్ పేజీ స్టార్‌గా దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా తన సోదరి షహీన్ భట్.. ఆలియాకు హార్ట్ ఫెల్ట్ నోట్ రాసింది.

‘ప్రియమైన ఆలియా.. నేను అంగీకరిస్తాను, మీకు ఇలాంటి లేఖ రాయడం చాలా సులభని ఊహించాను. కానీ రాసేటప్పుడు అర్థమవుతోంది ఎంత కష్టమో అని. లేఖ రాసేందుకు ఆలోచిస్తుంటే నా మైండ్ ప్రశ్నలతో నిండి ఉంది. మీకు ఇప్పటికే తెలియని అనివార్యమైన సెన్సార్‌షిప్‌తో నిండిన లేఖలో నేను మీకు ఏమి చెప్పగలను? మీ విషయంలో నేను నిర్లక్ష్యం చేసిన తెలియని భావాలు ఉన్నాయా? ఇది తెలివిగా పరిగణించబడుతుందా? నేను కూడా మీకు రాస్తున్నానా? రీడర్స్‌కు మీ రియాలిటీని చూపించడం నా పని. కానీ.. మీరెవరో ఇప్పటికే ప్రపంచానికి చూపించారు. ‘నిజమైన’ ఆలియా ఎవరు అనే దాని గురించి పాఠకులకు కొత్తగా పరిచయం చేయక్కర్లేదు, ఎందుకంటే నేను చూసే విధానంలోనూ రహస్య ఆలియా లేదు, మారువేషంలో కప్పబడిన మరో సంస్కరణ లేదు’ అని చెప్పింది.

కేవలం 19 ఏళ్ళ వయసులో ఆలియా తనతో చెప్పిన విషయాలను షహీన్ వెల్లడించింది. కెమెరా ముందున్నప్పుడు మాత్రమే నటిస్తానని ఆలియా చెప్పినట్లు తెలిపింది. కానీ ఆలియా తనలా కాకుండా మరొకరిలా నటించలేదని అభిప్రాయపడింది షహీన్. కానీ తాను కోరుకునేది ఒకటే.. ఆలియా ఎప్పుడూ పూర్తిగా ఆలియాలాగా మాత్రమే ఉండాలని.. భవిష్యత్తులో ఎలా ఉండాలి అనుకుంటుందో తెలుసుకోవాలని.. అలాగే ఎదగాలని కోరుకుంది.

Advertisement

Next Story

Most Viewed