- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాద్‌నగర్ బీజేపీ కార్యకర్తల సమావేశంలో రసాభాస
షాద్‌నగర్ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఎట్టకేలకు నాగులపల్లి శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగింది. చాలారోజుల తర్వాత నిర్వహించిన ఈ సమావేశానికి జిల్లా ముఖ్య నాయకులూ హాజరయ్యారు. కీలక నేతల సాక్షిగా కార్యకర్తల వ్యతిరేక నినాదాలతో సమావేశం రసాభాసగా మారింది. బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ చైర్మెన్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి నాయకత్వంపై ఆరు మండలాల నుంచి వచ్చిన ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పట్టణంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చెయ్యాలంటే మన్నుబుక్కినా పాములా ఉన్నవ్.. నువ్వేం నాయకుడివి అంటూ కార్యకర్తలు ధ్వజమెత్తారు. 28వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులను నిలబెట్టలేని అసమర్థ నాయకత్వం ఎవరి కోసం, హఠావో శ్రీవర్ధన్ రెడ్డి, బచావో బీజేపీ అంటూ పార్టీ అనుబంధ సంఘాల నాయకులే విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ గట్టి పోటీనిస్తే షాద్‌నగర్ పట్టణంలో మాత్రం కనీసం ఓట్ బ్యాంకు కూడా లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
శ్రీవర్ధన్ రెడ్డి సొంత వార్డులోనే బీజేపీకి రాయలేని ఓట్లు వచ్చాయని విమర్శించారు. ఢిల్లీలో కాదు గల్లీలో రాజకీయం చేస్తేనే పార్టీ అభివృద్ధి చెందుతుందని హితవుపలికారు. 2009 నుంచి శ్రీవర్ధన్ వల్ల పార్టీకి ఎలాంటి మేలూ జరగలేదనీ, నాయకత్వాన్ని మార్చాల్సిందేనని నినాదాలు చేశారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో షాద్‌నగర్‌లో ప్రచారం చెయ్యకుండా జడ్చర్లలో ఎందుకు ప్రచారం చేశారని ప్రశ్నించారు. దీనికి వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. మిగత రాజకీయ పార్టీల నాయకులు బీజేపీ నాయకులపై దాడులు చేస్తూ, కేసులు పెడుతుంటే ఎందుకు పట్టించుకోవడంలేదని నిలదీశారు.
షాద్‌నగర్ పట్టణంలో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క వార్డులోనూ గెలవని విషయం తెలిసిందే. అప్పట్నుంచే, పార్టీలో రాజకీయ అంతర్గత లుకలుకలు బయటికి వచ్చాయి. పార్టీ అనుబంధ సంఘాల నాయకులే సోషల్ మీడియా వేదికగా వ్యతిరేక పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ఓ వార్డులో బీజేపీ హేమాహేమీలు ఉన్నా.. అక్కడి అభ్యర్థికి కేవలం 14 ఓట్లే రావడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటిపై శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు తన వల్ల జరిగిన పొరపాట్లను సరిచేసుకుంటానని హామీనిచ్చారు. ఇకపై పార్టీ ఎదుగుదల కోసం అందరం కలిసి కృషి చేద్దామని శ్రీవర్ధన్ అన్నట్టు వినికిడి. అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.