నిశ్చితార్ధం అయిందని యువతిపై లైంగిక దాడి.. ఆపై ఘోరం

by Sumithra |   ( Updated:2021-08-14 08:53:35.0  )
Sexual assault
X

దిశ, వెబ్‌డెస్క్ : క్షణికానందాన్ని తీర్చుకోవడానికి నేటి సమాజంలో ఎన్నో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రేమ అని ఒకరు, పెళ్లి అని మరొకరు తమ కోర్కెలను తీర్చుకుంటున్నారు. ఆ తర్వాత నువ్వెవరో తెలియదంటూ ముఖం చాటేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు పెళ్లి చేసుకుంటానని యువతిలో నిశ్చతార్థం చేసుకుని పని తీరాక.. వదిలేసి వెళ్లాపోయాడు. గుజరాత్‌లో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అహ్మదాబాద్ జిల్లా మొరియ గ్రామానికి చెందిన యువకుడు స్థానికంగా ఉన్న ఆటోమొబైల్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. అతడికి సనంద్ గ్రామానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. దీంతో యువతి ఇంట్లో యువకుడి ప్రేమ గురించి చెప్పింది. ఇరు కుటుంబ సభ్యులకు విషయం తెలిసి ఇద్దరికి పెళ్లి చేసేందుకు ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఇద్దరికి నిశ్చితార్ధం చేశారు. ఆ తర్వాత యువకుడు తల్లిదండ్రులతో గొడవపడి యువతి ఇంట్లోనే ఉంటున్నాడు.

ఈ క్రమంలో ఒకే ఇంట్లోనే ఉంటున్న యువతీయువకుడికి నిశ్చితార్ధం అయిందని, ఆమెను బలవంతపెట్టి శారీరకంగా కలిశాడు. ఇలా రోజుల తరబడి సాగిన అనంతరం.. యువకుడు చెప్పపెట్టకుండా తన ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, నిశ్చితార్ధం క్యాన్సిల్ చేసుకోవాలని యువతికి చెప్పాడు. అతడి తల్లిదండ్రులు సైతం అదే విషయాన్ని తేల్చేశారు. పైగా యువతి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు. మనస్థాపం చెందిన యువతి విషం తాగింది. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రిలో యువతి వాంగ్మూలం నమోదు చేసుకున్న పోలీసులు యువకుడితోపాటు ఆయన తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉన్నది.

Advertisement

Next Story