సెక్స్‌లో అతణ్ని సుఖపెట్టి నీ ప్రేమను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-10-17 16:03:13.0  )
సెక్స్‌లో అతణ్ని సుఖపెట్టి నీ ప్రేమను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు
X

నేనో అబ్బాయిని ప్రేమించాను. ఓ రోజు అనుకోకుండా సెక్స్‌లో పాల్గొనమని ఒత్తిడి చేశాడు. అతని సంతోషం కోసం ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాను. చాలా నొప్పి వచ్చి, విపరీతంగా బ్లీడింగ్ అయ్యింది. వద్దన్నా వినకుండా చేశాడు. కొన్ని రోజులకు మళ్లీ కలిశాం. నాకో పక్క భయంగానే ఉన్నా ఒప్పుకున్నాను. రెండోసారి కూడా నొప్పి వచ్చి, బ్లీడింగ్ అయ్యింది. దాంతో అతను చాలా డిస్టర్బ్ అయ్యాడు. తనని సంతోష పెట్టలేకపోయినందుకు బాధగా ఉంది. నా యోని దగ్గర కూడా ఉబ్బెత్తుగా అవుతోంది. ఆ తరువాత ఎప్పుడూ కలవలేదు. కానీ పెళ్లయ్యాక కూడా ఇలాగే జరిగితే తనని బాధ పెట్టినదాన్ని అవుతానేమోనని భయంగా ఉంది. పరిష్కారం తెలపండి.

తణ్ని సుఖపెట్టాలని పెళ్లి కాకుండానే, నీకిష్టం లేకపోయినా, భయంతో, నొప్పి - బ్లీడింగులతో బాధపడాల్సిన అవసరం లేదు. సెక్స్‌లో అతణ్ని సుఖపెట్టి, నీ ప్రేమను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అతడు ఓ రకంగా నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. చాలామంది అబ్బాయిలు సెక్స్‌లో పాల్గొంటేనే వాళ్లకు తమపై (ప్రేమ ఉందని నమ్ముతామని కాబోయే భార్యలను ఒత్తిడి చేస్తుంటారు. అందరూ నీలాగా అమాయకంగా లొంగిపోయి అవాంఛిత గర్భాలు, ప్రాణాంతర గర్భస్రావాలు వంటి వాటితో నరకం అనుభవిస్తారు. శ్రావణీ! అతని ఒత్తిడికి లొంగకు. అవసరం లేదు. పెళ్లి తరువాతే సెక్స్ అని కచ్చితంగా చెప్పి అతణ్ని అవాయిడ్ చెయ్యి. పెళ్లైన తరువాత అతణ్ని సుఖపెట్టగలవా లేదా అన్న సంశయాలు తీర్చడానికి సెక్సాలజిస్టులున్నారు. అనవసరంగా ప్రమాదంలో పడకు.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Read More..

మీ భాగస్వామితో మరొకరు సరసాలాడినప్పుడు ఏం జరుగుతుంది?

Advertisement

Next Story