- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ముద్దు పెట్టి సెక్స్‌కు ప్రపోజ్..
మేడమ్! నేను బి.టెక్ 3వ సంవత్సరం చదువుతున్నాను. నాకు పెళ్లి నిశ్చితార్థం అయ్యింది. కానీ ఎం.టెక్ చేసి మంచి ఉద్యోగం చేయాలని నా ఆశ. మంచి సంబంధం ఎంగేజ్మెంట్ చేశారు. బి.టెక్ పూర్తి అయ్యాక పెళ్లి. ఇదిలా ఉండగా ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తను నన్ను ముద్దు పెట్టుకున్నాడు. అప్పట్నించీ నాలో చాలా మార్పు వచ్చింది. అతను సెక్స్‌కు ప్రపోజ్ చేస్తున్నాడు. ఎలాగూ, దంపతులం కాబోతున్నాం కదా అంటున్నాడు. నాకు అతని పట్ల ఆకర్షణ పెరుగుతోంది. మీ సలహా కావాలి.
మీ తల్లిదండ్రులు నీ మాట విని, నీ చదువు అయ్యాకే వివాహం గురించి ఆలోచించాల్సింది. సరే, ఇప్పుడు నువ్వు నీ జీవిత లక్ష్యం ఎం.టెక్ గురించి ఆలోచించాలి. స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఇక, నీ పెళ్లి ఎలాగూ అవుతుంది. ఈ లోపల అతని ప్రపోజలు ఒప్పుకోవద్దు. ఎలాగూ, కాబోయే దంపతులం కదా అని ఒత్తిడి తీసుకువచ్చినా... అతనికి ఏమీ నష్టం ఉండదు మానసికంగా, శారీరకంగా! ముందు అతనికి నీపై చిన్నచూపు ఏర్పడుతుంది. ప్రపోజల్‌తో ఒత్తిడి తెచ్చి నిన్ను ఆ పరిస్థితికి అతనే తెచ్చిన సంగతి మర్చిపోయి నిన్ను చులకనా చూస్తాడు. ఇక గర్భం వస్తే అబార్షనే గతి. దానివల్ల ఒక్కోసారి అండాన్ని మోసుకుపోయే ప్రమాదం ఉంది. అండవాహికల్లో బ్లాక్స్ ఏర్పడి మూసుకుపోయి భవిష్యత్తులో పిల్లలు పుట్టకుండా పోయే అవకాశం ఉంటుంది. మానసికంగా ఒత్తిడికి, అవమాన భారానికి గురై చదువు మీద దృష్టి తగ్గి చదువు దెబ్బ తినే ప్రమాదమూ ఉంటుంది. కాబట్టి, నిన్ను నువ్వు కంట్రోల్ చేస్కోవాలి. అతని కోరికను హుందాగా తిరస్కరించి చదువు మీద ఏకాగ్రత చూపించు.
- డాక్టర్ భారతి, MS
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్
Read More..