హస్త ప్రయోగంతో దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయా? సైన్స్ చెబుతుంది ఇదే..!

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-10-04 14:29:10.0  )
హస్త ప్రయోగంతో దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయా? సైన్స్ చెబుతుంది ఇదే..!
X

మేడమ్... నా వయస్సు 26 సంవత్సరాలు. దాదాపు 12 సంవత్సరాల నుంచి హస్తప్రయోగం చేస్తున్నాను. ఇప్పుడు నాకు సెక్స్ కోరికలు బాగా తగ్గాయి. ఇప్పుడు హస్తప్రయోగం చేయాలనిపించినా, అమ్మాయిల గురించి ఆలోచించినా వెంటనే అంగం స్తంభించడం లేదు. ఎంతసేపు ప్రయత్నించినా అంగం ముడుచుకుపోతుంది. పది రోజులకొకసారి నిద్రలో అంగం స్తంభిస్తుంది. హస్తప్రయోగం చేయడం చాలా ప్రమాదకరమని ఈ మధ్య ఒక బుక్‌లో చదివాను. హస్తప్రయోగం మానాలని ఎంత ప్రయత్నించినా మానలేకపోతున్నాను. నాలాగే, చాలామంది యువకులు ఈ సందేహంతో సతమతమవుతున్నారని నా అనుమానం. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - వి.పి.ఆర్.వై., సికింద్రాబాద్.

స్తప్రయోగం వారానికి నాలుగైదు సార్లు చేసుకోవడం వల్ల ఏ రకమైన నష్టం కలగదు. మొటిమలు రావడం, శారీరక బలహీనత, నరాల బలహీనత, శీఘ్రస్ఖలనం, అంగస్తంభన లోపం, చర్మం నల్లగా కావడం, వీర్యకణాల లోపం ఇవేవి హస్తప్రయోగం వల్ల రావు. అయితే, గుర్తించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అతి హస్తప్రయోగం ఒక విపరీతమైన, మానుకోలేనన్నిసార్లు రోజులో ఒక అబ్సెషన్‌గా చేయడం, రోజులో 3 నుంచి 6 సార్లు చేస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక మనోలైంగిక సమస్యగా మారి సెక్స్ సమస్యలకు దారితీస్తుంది. అలాగే, 'హస్తప్రయోగం తప్పు, పాపం' అన్న అశాస్త్రీయమైన ఆలోచనలతో నిగ్రహించుకోలేక చేసేసిన తర్వాత గిల్టీగా ఫీలవడం, దీనితో పాటు భయానికి, ఆందోళనలకు గురవడం వల్ల కూడా శీఘ్రస్ఖలనం, అంగస్తంభన సమస్యలు వస్తాయి. హస్తప్రయోగం వివాహానికి ముందు సెక్స్ హార్మోన్స్ వల్ల సహజంగా కలిగే లైంగిక కోరికలను తీర్చుకోవడానికి దేహానికున్న ఒక ప్రకృతిసిద్ధమైన ఏర్పాటు. ఒక ఆకలి, నిద్ర, దాహంలా హస్త ప్రయోగం ద్వారా శృంగార కోరికను తీర్చుకోవడం కూడా. అయితే, ఇది అతి అయితే నడుములోని సెక్స్ కండరాలు బిగుసుకుపోయి, నడుము నొప్పి వస్తుంది. అలాగే, ఎవరైనా చూస్తారేమో, తప్పేమో అన్న భయం, అభద్రతతో కూడిన మానసిక స్థితి ఖచ్చితంగా శీఘ్రస్ఖలనానికి దారితీస్తుంది. అతిగా హస్త ప్రయోగం చేయడాన్ని కంట్రోల్ చేయవచ్చు. బ్లూఫిల్మ్, పోర్న్ సైట్స్ చూడటం మానెయ్యాలి. చదువు మీద, సమాజానికి ఉపయోగపడే ఇతర మంచి పనుల మీద ఏకాగ్రత పెట్టాలి. ఒంటరిగా ఉండకూడదు. నలుగురిలో ఉండాలి. నిరుద్యోగులైతే ఏదో ఒక ఉద్యోగం ఖచ్చితంగా వెతుక్కొని బిజీ అయిపోవాలి.

- డాక్టర్ భారతి, MS

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Advertisement

Next Story

Most Viewed